ఆర్ ఆర్ ఆర్ విషయంలో అభిమానుల మధ్య వార్ !

Seetha Sailaja
రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లతో ఒక మల్టీ స్టారర్ తీయడం అంటే చాల కష్టమైన పని. రాజమౌళి లాంటి టాప్ దర్శకుడికి కూడ వీరిద్దరితో సినిమా తీయడం అంటే ఎంత కష్టమో లేటెస్ట్ గా జూనియర్ పుట్టినరోజునాడు జరిగిన ఒక సంఘటన జక్కన్నకు కూడ తెలిసివచ్చేల చేసింది. జూనియర్ పుట్టినరోజునాడు ‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ ఆ మూవీలో జూనియర్ పాత్రకు సంబంధించిన కొమరం భీమ్ పోష్టర్ ను విడుదల చేసారు.

అయితే ఈ పోష్టర్ ఆశించినంతగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారలేదు. వాస్తవానికి ఈ మూవీకి సంబంధించి జునియర్ చెప్పిన ఒక పవర్ ఫుల్ డైలాగ్ రాజమౌళి బయటపెడతాడు అనుకుంటే అదేమీ జగకుండా కేవలం ఒక పోష్టర్ తో సరిపెట్టడంతో జూనియర్ అభిమానుల ఉత్సాహం నీరు కారిపోయింది.

ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపడే విధంగా సోషల్ మీడియా వేదికగా చరణ్ జూనియర్ అభిమానుల మధ్య జరిగిన హ్యాష్ ట్యాగ్ వార్ చాలామందికి షాకింగ్ గా మారింది. ‘#FanBaselessRamCharan and #FanBaselessNTR.’ అంటూ ఒక వార్ చరణ్ జూనియర్ అభిమానుల మధ్య కొన్ని గంటల పాటు కొనసాగింది.

‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల తేదీ పై ఇప్పటికీ క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి 325 కోట్ల రూపాయలు ఒక ప్రముఖ సంస్థ ఆఫర్ చేసింది అంటూ వచ్చిన వార్తల పై జూనియర్ చరణ్ అభిమానుల మధ్య రగడ మొదలైంది. ఈ డీల్ చరణ్ ఇమేజ్ వల్ల జరిగింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరికొందరు ఈ డీల్ జూనియర్ ఇమేజ్ వల్ల ఖరార్ అయింది అంటూ మాటల యుద్ధం మొదలుపెట్టి ఈ హ్యాష్ ట్యాగ్ వార్ కు తెర తీసారు. ఈ వార్ నిజంగానే చరణ్ జూనియర్ అభిమానుల వీరాభిమానంతో జరిగిందా లేకుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ ఇమేజ్ ని పాడుచేయాలని మరెవ్వరైనా ఈ హ్యాష్ ట్యాగ్ వార్ ను క్రియేట్ చేసారా అంటూ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: