సాధారణ కుంటుంబం నుండి వచ్చిన నందమూరి తారకరామారావు చరిత్రలో ఒకరిగా నిలిచారు. సినిమా రంగంలో సక్సెస్ అయిన తరవాత రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు తరవాత వారసుల్లో బాలక్రిష్ణ కూడా సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అయితే తాత పేరును పెట్టుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాత పేరును నిలబెట్టిన మనవడిగా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు. అంతే కాకుండా ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా అన్నగారిలో ఉన్న ఈ లక్షణాలు ఎన్టీఆర్ లో కూడా మనకు కనిపిస్తాయి. అన్నగారు తన నటప్రస్థానాన్ని చిన్న వయసులోనే మొదలు పెట్టారు. నాటకాలు వేస్తూ నటనలో మెలుకువలను తెలుసుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా తన చిన్న వయసులోనే నటించడం మొదలు పెట్టి 23 ఏళ్ల వరకు ఇంస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకడిగా కాకుండా స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు.
అంతే కాకుండా ఎన్టీ రామారావుకు పౌరాణిక సినిమాలన్నా....పౌరాణిక పాత్రల్లో నటించాలన్నా బలే ఇష్టం. రాముడు..రావడణుడు లాంటి పాత్రల్లో నటించిన అన్నగారు సినీ పరిశ్రమలో తన మార్క్ వేసుకున్నారు. గుటక వేయకుండా డైలాగులు చెప్పి...ముక కవలికలతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసారు. ఇక ఎన్టీఆర్ కు కూడా పౌరాణిక సినిమాలు అన్నా అందులో నటించడం అన్నా ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ యమ దొంగ సినిమాలో నటించి తాతకు తగ్గమనవడు అనిపించుకున్నారు. సినిమాలో ఎన్టీఆర్ ను చూసిన వారు అన్నగారు మళ్లీ పుట్టాడని సంతోషించారు. మరోవైపు నటనలో ప్రయోగాలు చేయడం కూడా ఎన్టీఆర్ కు తాత నుండే వచ్చిందేమో. అన్నగారు మాయాబజార్ లో వేసిన కృష్ణుడి పాత్ర, బడి పంతులు సినిమాలో స్కూల్ హెడ్ మాస్టర్ పాత్ర, అంతే కాకుండా ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అదే విధంగా ఎన్టీఆర్ కూడా జై లవ కుశ సినిమాలో మూడు పాత్రలు వేసి అదరగొట్టాడు. హీరోగానే కాకుండా విలన్ గానూ నటించి విమర్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇవే కాకుండా అన్నగారిలో ఉన్న ఎన్నో లక్షణాలు ఎన్టీఆర్ లోనూ ఉన్నాయి.