సోనూ సూద్ సహకారంతో కంగన కు సమాధానం చెప్పబోతున్న క్రిష్ !
దీనితో క్రిష్ కు జాతీయ స్థాయిలో దక్కవలసిన గౌరవం దక్కకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులలో మరొకసారి అదృష్టం క్రిష్ తలుపు తట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు క్రిష్ సోనూ సూద్ ను హీరోగా చేసి ఒక బాలీవుడ్ మూవీని నిర్మించబోతున్నాడని తెలుస్తోంది.
బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ ఈమూవీ నిర్మాణ బాధ్యతలను తీసుకోబోతున్నట్లు టాక్. సామాజిక చైతన్యంతో కూడిన ఈమూవీలో ప్రస్తుత రాజకీయాల నేపధ్యం కూడ ఉంటుంది అని అంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ ఆతరువాత వచ్చిన సెకండ్ వేవ్ పరిస్థితులలో సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాలు ముఖ్యంగా కరోనా బాధితులకు సోనూ సూద్ అందిస్తున్న సహాయ సహకారాలతో ఇప్పుడు సోనూ సూద్ దేశ వ్యాప్తంగా సెలెబ్రెటీగా మారిపోయాడు.
ఇతడుకి ఏర్పడిన ఇమేజ్ తో ప్రస్తుతం ‘ఆచార్య’ తో నటిస్తున్న చిరంజీవి సోనూ సూద్ ను ఈమూవీలో ఒక తన్ను తన్నే సీన్ ను పెట్టవద్దని అలాంటి సీన్ ను ఇప్పుడు సోనూ సూద్ కు ఏర్పడే ఇమేజ్ రీత్యా ‘ఆచార్య’ సినిమాలో పెడితే సినిమా పై నెగిటివ్ కామెంట్స్ వస్తాయని చిరంజీవి భావించాడు అని అంటారు. అలాంటి టాప్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగిపోయిన సోనూ సూద్ తో క్రిష్ మూవీ తీస్తాడు అంటే మళ్ళీ బాలీవుడ్ లో క్రిష్ పాపులర్ డైరెక్టర్ గా మారిపోతాడు..