థియేటర్ లో బాహుబలి ఆట.. బాక్స్ ఆఫీస్ వద్ద అవార్డుల వేట?

praveen
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు భారీ అంచనాలతో విడుదల కావడమే కాదు ఇక అదే రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తూ భారీ విజయాన్ని సాధిస్తూ ఉంటాయ్. ఇలాంటి సినిమాలలో ఒకటి బాహుబలి.  ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో గుంపులో గోవిందలా కాకుండా గుంపులో ఒకే ఒకటిగా నిలిచిన సినిమా.  భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి రికార్డుల కోసం వేట సాగించింది.  రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించిన తీరు కేవలం భారతీయ సినీ ప్రేక్షకులకు మాత్రమే కాదు ప్రపంచ సినీ లవర్స్ ని ఫిదా చేసింది.

 ఇక ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమ పేరును..  ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి సినిమా.  ఇక ఈ సినిమా భారీగా వసూళ్లు రావడం.. ఎన్నో రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. ఎన్నో అవార్డులు కూడా దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరికీ కూడా ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చి పడింది. బాహుబలి సినిమా అవార్డుల విషయానికొస్తే.. ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను ఇంకెన్నో ఐఫా అవార్డులు గెలుచుకుంది.  ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో భాగంగా  ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి అవార్డు సొంతం చేసుకుంది.

బాహుబలి సినిమాలో కీలక పాత్రలో నటించిన రమ్యకృష్ణ  బెస్ట్ సపోర్టింగ్ నటిగా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకుంది.  అంతేకాకుండా బెస్ట్ సినిమాటోగ్రాఫర్... బెస్ట్ పర్ఫార్మెన్స్  ఇలా అన్ని విభాగాల్లో కూడా బాహుబలి సినిమా అవార్డుల వేట సాగించింది.  కేవలం తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు తమిళ కన్నడ ఇండస్ట్రీ లో కూడా దర్శకధీరుడు రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు ఐఫా ఉత్సవ్ అవార్డులు కూడా దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: