ప్రభాష్ సినిమాలో బిగ్ బాస్ విన్నర్..?
సీతగా కృతీ సనన్, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ‘ఆదిపురుష్' మూవీ షూటింగ్ ముంబై నగరంలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రారంభించారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ఆదిపురుష్' సినిమా కోసం ఎంతో మంది ప్రముఖులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. రామాయణం అంటే చాలా పాత్రలు ఉంటాయి కాబట్టి పేరున్న వాళ్లనే తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్‌ను తీసుకున్నారని ఓ న్యూస్ లీకైంది. హిందీ బిగ్ బాస్ 13వ సీజన్ విజేత, ప్రముఖ నటుడు సిద్దార్థ్ శుక్లా ‘ఆదిపురుష్'లో కీలక పాత్రను పోషిస్తున్నాడట. కాసేపే కనిపించే మేఘనాథుడి పాత్రలోనే అతడు నటిస్తున్నాడని తెలిసింది. కొన్ని డబ్బింగ్ సీరియళ్ల ద్వారా అతడు దక్షిణాది మొత్తానికి పరిచయం అయ్యాడు. అందుకే అతడిని ఈ సినిమాలో భాగం చేయాలని దర్శకుడు భావించి ఈ పాత్రకు ఎంపిక చేశాడని సమాచారం.