నాగార్జున, అనుష్క కలిసి ఎన్ని సినిమాలు చేశారో తెలుసా..!

N.ANJI
ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున, అనుష్క జంటకు చాలా క్రెజ్ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ ఎన్ని సినిమాలు కలసి నటించారో ఒక్కసారి చూద్దామా. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్’ సినిమాలో నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి తొలిసారిగా కలిసి నటించారు. హీరోయిన్‌గా అనుష్క శెట్టికి ఇదే తొలి మూవీ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.
లారెన్స్ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాన్’ సినిమాలో రెండో సారి నాగార్జున, అనుష్క శెట్టి కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నడిచింది. నాగార్జున హీరోగా నటించిన ‘కింగ్’ మూవీలో ఓ పాటలో మూడోసారి అనుష్క శెట్టి మిగతా కథానాయికలతో కలిసి మెరిసింది. నాగార్జున హీరోగా నటించిన ‘కేడి’ మూవీలో అనుష్క శెట్టి ఓ పాటలో కలిసి నాలుగో సారి కనిపించింది.
ఇక ఐదోసారి అనుష్క శెట్టి, నాగార్జున ‘రగడ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌‌గా నిలిచింది. ఆరోసారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి ‘డమరుకం’ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఏడో సారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి ‘సోగ్గాడే చిన్నినాయనా’’ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎనిమిదో సారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి ‘ ఊపిరి’ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు ప్రేమికులుగా నటించారు. కానీ పెళ్లి చేసుకోరు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.
అయితే తొమ్మిదో సారి నాగార్జున అక్కినేని, అనుష్క శెట్టి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్రంలో వీరిద్దరు జంటగా నటించలేదు. నాగార్జున, అనుష్క శెట్టి ఇపుడు పదోసారి కలిసి నటించబోతున్నట్టు సమాచారం. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో అనుష్క ఓ కథానాయికగా నటించబోతున్నట్టు సమాచారం. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిచింది. అనుష్క ష్లాష్ బ్యాక్‌లో కనిపించనున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: