అనుష్క తీరు పై ఆందోళన చెందుతున్న అభిమానులు !
వీరిద్దరి మధ్య నడిచే ఒక విచిత్ర ప్రేమ కథాంశం చుట్టూ ఈమూవీ తిరుగుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు ఇలా కొనసాగుతూ ఉండగా అనుష్క లేటెస్ట్ లుక్ ఇలా ఉంది అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసిన ఒక ఫోటో చూసి అనుష్క అభిమానులు తీవ్రంగా టెన్షన్ పడిపోతున్నారు.
ఈ ఫోటోలో అనుష్క ఎక్కడా హీరోయిన్ లుక్ లో కాకుండా చాల సాదాసీదా గా కనిపిస్తోంది. దీనికితోడు ఈ ఫోటోలో అనుష్క మొఖంలో ఎక్కడా గ్లో కనిపించక పోవడంతో తిరిగి అనుష్కక కు ఏమైంది అంటూ కామెంట్స్ ప్రారంభం అయ్యాయి. ‘సైజ్ జీరో’ మూవీ తరువాత అనుష్క శరీరంలో వచ్చిన మార్పులు ఇప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు అన్నమాట వాస్తవం.
ఇది ఇలా ఉంటే అనుష్క సింగపూర్ కు చెందిన ఒక వ్యాపార వేత్తను పెళ్లాడబోతోందని అయితే ఆ వ్యాపార వేత్త అనుష్క కంటే వయసులో చిన్నవాడని అన్న వార్తల హడావిడి కూడ జరిగింది. కానీ ఎప్పటిలాగే ఈ వార్తల పై కూడ అనుష్క తన మౌనాన్ని కొనసాగించింది. ఇప్పుడు ఆ వార్తల హడావిడి తగ్గిపోయి ఇప్పుడు లేటెస్ట్ గా అనుష్క కొత్త లుక్ ఇదే అంటూ జరుగుతున్న ప్రచారం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. అయితే మరికొందరు మాత్రం ఈ ఫోటో ఇప్పటిది కాదనీ గతంలో అనుష్క తన బరువును తగ్గించుకోవడానికి తరుచు బెంగుళూరు లోని ఒక జిమ్ముకు వెళ్ళిన సందర్భంలో అజ్ఞాతంగా ఒక అభిమాని తీసిన ఫోటో అయి ఉండవచ్చు అంటూ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..