ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?

Satya
తెలుగు సినిమా ఒకప్పుడు అచ్చమైన తెలుగుదనంతో నిండి ఉండేది. తెలుగు టైటిల్ తో మొదలుకుని తెలుగు మాట. పాట అంతా తెలుగులోనే ఉంటూ వచ్చేది. అయితే కాలం మారిపోయింది. అదే విధంగా తెలుగు సినిమాలోనూ కొత్త పోకడలు వచ్చేశాయి. ఫలితంగా తెలుగు సినిమా కూడా నానా రకాలుగా మార్పులకు లోను అయింది.
ఇక హీరో  ఒక్కరే తెలుగు వారు తప్ప మిగిలిన విభాగాలు అన్నీ కూడా ఎక్కడ నుంచి అయినా ఎవరినైనా తీసుకునే సీన్ వచ్చేసింది. ముఖ్యంగా హీరో పక్కన కనిపించే హీరోయిన్లు పరాయి భాష వారు ఉంటున్నారు. ఈ కల్చర్ మొదలై నాలుగు దశాబ్దాలు పై దాటింది. ఇతర భాషల వారిని తీసుకు వచ్చి తెలుగులో హీరోయిన్లను చేయడం ఇపుడు సర్వసాధారణంగా మారింది.
అయితే ఇంతకాలం ముంబై హీరోయిన్లే టాలీవుడ్ ని శాసించారు. కొత్త హీరోయిన్ అంటే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఫ్లైట్ వేసుకుని దిగి వచ్చేవారు. కానీ ఇపుడు ముంబై భామలకు గట్టి పోటీ ఎదురవౌతోంది. అది కూడా సౌత్ నుంచే. అంటే తెలుగు మాత్రం కాదు. పక్కనున్న కర్నాటక నుంచి.
నిజానికి కన్నడ సీమ మొదటి నుంచి తెలుగు సినిమాకు ఎంతో సాయంగా ఉంటోంది. కన్నడ నటులు టెక్నీషియన్లు ఎంతో మంది తెలుగులో రాణించారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే అలనాటి హీరోయిన్లు భారతి జయంతి నుంచి సౌందర్య, అనుష్క శెట్టి వంటి వారు అంతా కూడా కన్నడ కస్తూరీలే. అయితే లేటెస్ట్ గా కన్నడ భామల తాకిడి తెలుగు మీద ఎక్కువైపోయింది. అది ఎంతలా అంటే ముంబై భామలను చాలెంజ్ చేసేలా అని చెప్పాలి.
ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ రేంజిలో ఉంటున్న పూజా హెగ్డే కన్నడ అందం. ఈ అమ్మడు టాలీవుడ్ లో నంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. ఆమె కాల్షీట్లు ఇస్తే చాలు సినిమా అనే సీన్ ఉంది. ఆమెతో పోటీ పడుతున్న రష్మిక మందన కూడా కన్నడ అందమే. ఈ ఇద్దరూ ఇపుడు తెలుగుని శాసిస్తూంటే కొత్త పోటీగా ఉప్పెన అందం కృతి శెట్టి కూడా వచ్చేసింది. దీంతో ఈ భామకు కూడా జోరుగా చాన్సులు వస్తున్నాయి.
ఈ పరిణామంతో ఎక్కువగా దెబ్బ అయిపోతున్నది ముంబై హీరోయిన్లేనట. ఇంతకాలం వారికి ఫ్లైట్లు పెట్టి మరీ సకల మర్యాదలు చేసిన టాలీవుడ్ ఇపుడు హ్యాపీగా పొరుగున ఉన్న కన్నడ సీమ నుంచే అందాల భామలను తెచ్చి సినిమాలు తీస్తోంది. ఇక టాలీవుడ్ లో కన్నడ భామలకు అవకాశాలు పెరగడంతో మరింతమంది బెంగుళూరు భామలు టాలీవుడ్ మీదకు దండెత్తుతున్నారుట. మొత్తానికి చూస్తే బాలీవుడ్ ని శాసించిన  శిల్పా శెట్టి, దీపికా పదుకుణే వంటి వారు కూడా కన్నడ భామలే అన్నది ఈ సందర్భంగా గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: