అబ్బబ్బా.. ఏం టాలెంట్ గురూ.. ఆ పాప ఇరగదీసిందంతే?
ఇంతకీ ప్రస్తుతం బీట్ బాక్స్ ముచ్చట ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా.. ఇప్పటికే ఎంతో మంది వివిధ రకాల బీట్ బాక్స్ టాలెంట్ ని చూసి ఉంటారు. ఇక ఇటీవల ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమంలో ఓ యువతి బీట్ బాక్స్ వాయించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. ఎన్నో రకాల సౌండ్స్ మిక్స్ చేసి అందర్నీ ఉర్రూతలూగించే విధంగా బీట్ బాక్స్ వాయించింది ఆ యువతి. ఇన్ సైడ్ మ్యూజిక్ అవుట్ సైడ్ మ్యూజిక్ అంటూ వివిధ రకాల వేరియేషన్స్ కూడా చూపించి అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా అయితే ప్రతి వారం కూడా సరికొత్త టాలెంట్ ఉన్న వ్యక్తులను కంటెస్టెంట్స్ గా పిలిచి ఇక వారి చేత పర్ఫామెన్స్ చేయిస్తూ ఉంటారు నిర్వాహకులు. ఈ సారి కూడా ఓ అమ్మాయిని కంటెస్టెంట్స్ గా పిలవగా ఆ యువతి తన బీట్ బాక్స్ టాలెంట్ మొత్తం ఉపయోగించి అందరిని ఫిదా చేసింది అని చెప్పాలి. ఇక ఆ అమ్మాయి టాలెంట్ చూసి అక్కడున్న కమెడియన్స్ అందరూ కూడా స్టేజి పైన కి వచ్చి మరి అభినందనలు తెలిపారు.