హ్యాపీ సండే 9-MAY: ఈ వారం టాలీవుడ్ టాప్ గాసిప్ ఇదే..!

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నిజానికి త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అనుకోని కారణాల నేపథ్యంలో ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశారు.
ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబుతో కూడా సినిమాను అనౌన్స్ చేశారు. అయితే మధ్యలో ఎన్టీఆర్ ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నారు అని ప్రచారం జరిగింది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్న బుచ్చి బాబుతో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. సుకుమార్ శిష్యుడిగా ఆయన వద్దనే దర్శకత్వం నేర్చుకున్న బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తక్కువ బడ్జెట్ తో చేసిన ఆ సినిమాకు భారీ కలెక్షన్స్ రావడంతో ఈయనకు రెండోసారి కూడా తమ బ్యానర్ లోనే సినిమా చేసే అవకాశం కల్పించారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు.
అయితే బుచ్చిబాబు రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తో చేస్తున్నాడని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ వస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడని అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ బుచ్చి బాబు స్క్రిప్ట్ కి ఓకే చెప్పాడు గాని సినిమా ఎప్పుడు చేయాలి ? అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తూ బుచ్చిబాబు ప్రస్తుతానికి వెయిటింగ్ మోడ్ లో ఉన్నారని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ దృష్టి అంతా ప్రస్తుతం రాజమౌళి సినిమా మీదనే ఉంది, రాజమౌళితో సినిమా పూర్తయిన తర్వాత ఆయన కొరటాల శివతో సినిమా ప్రారంభిస్తారు. ఆ సినిమా వచ్చే ఏడాది జూన్ వరకు షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అప్పటిదాకా బుచ్చిబాబు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది కాలమే నిర్ణయించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: