"వి" ప్లాప్ తర్వాత ప్లాన్ భారీగానే ఉందట ... ?
అయితే ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి అక్కినేని వారసుడు నాగచైతన్య తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు చిత్ర సీమలో వార్తలు వినిపించాయి. కానీ దాని గురించి ఎటువంటి ప్రకటన రాకముందే, చైతూతో సినిమా తర్వాత హీరో శర్వానంద్ తో మరో సినిమాకి ఇంద్రగంటి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆడాళ్లు మీకు జోహార్లు .. మహాసముద్రం ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్, ఇంద్రగంటి చెప్పిన కథ నచ్చడంతో నా నెక్ట్స్ ప్రాజెక్టు మీతోనే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇంద్రగంటి చెప్పిన కాన్సెప్ట్ ఇది వరకు ఎప్పుడూ శర్వానంద్ చేయలేదని, అలాంటి పవర్ ఫుల్ పాత్రలో శర్వానంద్ ను ప్రెజెంట్ చేసేందుకు కథను మరింత బలంగా సిద్దం చేస్తున్నాడట ఇంద్రగంటి. అయితే ఇది ఎంతవరకు నిజమో , ఆ స్టోరీ లైన్ ఏమిటో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ క్లారిటీ రాదు. కాగా అటు ఇంద్రగంటి ఇటు శర్వానంద్ ఇద్దరికీ ఒక మంచి హిట్ అవసరం. రీసెంట్ సినిమా శ్రీకారం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో శర్వానంద్ తరువాత ప్రాజెక్టులపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. ఏమి జరుగుతుందో చూడాలి.