యూత్ ని మైమరిపిస్తున్న సాంగ్...
ఇక ఈ సినిమా నిర్మాత అలాగే హీరోయిన్ మాట్లాడుతూ...రాహుల్ కి వున్న క్రేజ్ ట్యూన్ లో వున్న కిక్ సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వటానికి కారణం. ఈ సాంగ్ ని ప్రముఖ లిరిక్ రైటర్ శ్రీమణి అందించారు. క్యాచి లిరిక్స్ కావటం తో అందరికి ఫుట్ ట్యాపింగ్ అవుతుంది. మా దర్శకుడు దయా చాలా చక్కగా పిక్చరైజేషన్ చేయించాడు. మా శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం 1 గా వస్తున్న బాయ్స్ ఆడియో జ్యూక్ బాక్స్ చార్ట్‌బస్టర్ లో టాప్ లో నిల్చుంటుందని మా అందరి నమ్మకం. మా నమ్మకానికి స్మరన్ అందించిన ఆడియో సూపర్ ప్లస్ అయ్యింది. అలాగే మా సహ నిర్మాత బాలచందర్ చిత్ర నిర్మాణ బాధ్యతలు తీసకున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కంటెంట్ డిస్ట్రబ్ అవ్వకుండా గ్రాండియర్ గా మాకు ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా నిర్మించారు. అలాగే ఇక ఈ సినిమా సంబంధించిన మరిన్ని వివరాలు తొందర్లో వెల్లడిస్తామన్నారు. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ ని యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.