మహేష్, త్రివిక్రమ్ తో కొత్త సినిమా ప్రకటన..!
ఇక ఇది ఇలా ఉంటె ఈ సినిమా తర్వాత మహేష్ ఏ సినిమా చేయనున్నాడు అనే విషయంపై ఈరోజు క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఈరోజు మహేష్ కొత్త సినిమాను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. సర్కారు వారి పాట సినిమా తర్వాత మరోసారి మహేష్ దర్శకుడు త్రివిక్రమ్‌తో చేయనున్నాడు అని తెలుస్తోంది. దీనికి సంబంధించి శనివారం ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు మంచి పేరును తెచ్చాయి. కానీ పెద్దగా థియేటర్‌లో అలరించలేదు. చూడాలి మరి కొత్త సినిమా ఎలా ఉండనుందో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతుంది అనే అంశంపై సరికొత్త రూమర్స్ వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అధికారికంగా ప్రకటించేది ఈరోజే అని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత మేర నిజముందో కానీ వేచి చూస్తే కానీ తెలియదు.
ఇక దీనికి సంబంధించి ఈరోజు ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాను హారికా హాసిని బ్యనర్‌లో చినబాబు నిర్మించనున్నారు. ఒక వేళా ప్రకటన ఈరోజు రాకపోతే ఈ 31న ఉండొచ్చు అని అంటున్నారు. మరోవైపు సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ ను మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న విడుదల చేయనున్నారని సమాచారం. అంతేకాదు మరో సర్ఫైజ్ ఏమిటంటే, ఈ చిత్రం టీజర్ ఆగస్టు 9 న అంటే మహేష్ పుట్టినరోజున విడుదల అవుతుందని తెలుస్తోంది.