మోనితా వల్లే దీప చనిపోతుందా? అసలు ట్విస్ట్ ఇదే..
అందులో భాగంగా ఇంట్లో పూజలను నిర్వహించారు. ఈ పూజకు కార్తిక్, దీప జంటగా కూర్చోవాలి..అసలు దీప పక్కన కూర్చోవడానికి ఒప్పుకుంటాడో లేదో అని సౌందర్య అందరూ అనుమాన పడుతుండగా.. కార్తీక్ పట్టు పంచె తీసుకుని తనంతట తాను రెడీ అవ్వడానికి వెళ్తుంటాడు.సౌందర్య ఆశ్చర్యంగా చూస్తుండటంతో.. ఏంటి అలా చూస్తున్నావ్ మమ్మీ... పీటల మీద కూర్చోవాలని అన్నావ్‌గా.. నీ కోడలికి చెప్పు అని అంటాడు. దీంతో సౌందర్య.. దీపని రెడీ అవ్వమని లోపలికి పంపిస్తుంది..
ఈ విషయం పై ఆదిత్య షాక్ అవుతాడు.. అన్నయ్య ఇంత ఈజీగా ఒప్పుకోవడం ఎంటి అనే సందేహం లో ఉంటాడు.. దీంతో సౌందర్య కూడా అదే అంటుంది.కట్ చేస్తే.. అంతలోకే సీన్ లోకి మోనిత ఎంటర్ అవుతుంది. అందరూ ఒక్కో విధంగా చెవులు కోరుక్కుంటా రు.. ఇక సౌందర్య నువ్ ఎందుకు వచ్చావ్.. ఎందుకు అవమాన పడుతున్నావ్ అని అంటే.. అవమానాలు నాకు కొత్త కాదు.. కానీ నేను పిలవని పేరంటానికి రాలేదు. కార్తీక్ పిలిస్తేనే వచ్చాను.. నా కార్తీక్ పిలిస్తే రాకుండా ఉంటానా.. నో చెప్పను.. ఇప్పుడు కూడా కార్తీక్ చెప్పిందే వింటున్నా.. దీపకి ట్యాబ్లెట్ వేయమన్నాడుగా అందుకే వచ్చాను అంటుంది.
కానీ , దీప మాత్రం విసిరికొడుతుంది.. దాంతో కార్తిక్ ఆ మెడిసిన్ ను తీసుకుంటాడు. మోనిత కంగారు పడుతుంది. కార్తిక్ చూస్తే తన బండారం బట్టబయలు అవుతుందని టెన్షన్ పడుతుంది.కార్తీక్ డోస్ ఎంతన్నది గమనించకుండా.. ట్యాబ్లెట్‌ని తీసుకొచ్చి దీపకి అందిస్తాడు. అతని మాటని కాదనలేక దీప ట్యాబ్లెట్ వేసుకుంటుంది. అది చూసిన మోనిత సంతోషానికి అవధులు ఉండవు. వెంటనే కార్తీక్ చేతిలో మిగిలిన ట్యాబ్లెట్స్ తీసుకుని జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు గుడ్ గర్ల్ అనిపించుకున్నావ్.. వెళ్లి దీప పక్కన కూర్చో కార్తీక్ అని అంటుంది మోనిత.. కాసేపటికి దీపకి కళ్లు తిరిగి కార్తిక్ భుజాల పై పడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో మాత్రం ట్విస్ట్ మాములుగా లేదు..దీప కు ఏమైంది అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది.. మిస్ కాకుండా చూడండి..