ఆయనే కావాలని పట్టుబడుతున్న మహేష్, పవన్ ఫ్యాన్స్ ..... ??
అయితే వీరిద్దరికంటే ముందు టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు సంగీత దర్శకుడిగా చక్రం తిప్పారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. నిజానికి 2000వ దశకంలో దాదాపుగా పదేళ్లకు పైగా ఎన్నో సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన మణిశర్మ, వాటితో మరెన్నో విజయాలు అద్భుతమైన పేరుని దక్కించుకున్నారు. ఇక అప్పట్లో బడా హీరోలు ఎవరి నుండి సినిమా వచ్చినా దానికి మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ ఉండాల్సిందే. అటువంటి మణిశర్మ, దేవిశ్రీ, అలానే థమన్ ల రాక తరువాత మెల్లగా ఛాన్స్ లు లేక వెనక్కి తగ్గారు.
అయితే ఇటీవల జెంటిల్మన్, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాల సక్సెస్ లతో పాటు వాటి సాంగ్స్ తో కూడా ఆకట్టుకున్న మణిశర్మ చేతిలో ప్రస్తుతం ఆచార్య, నారప్ప, లైగర్ వంటి బడా సినిమాలు ఉన్నాయి. మరోవైపు గతంలో సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల సినిమాలకు ఎన్నో అద్భుతమైన సాంగ్స్ అందించిన మణిశర్మ నే మళ్ళి తీసుకోవాలని పలువురు ఆయా హీరోల అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు. దేవిశ్రీ, థమన్ ఎంత అద్భుతంగా మ్యూజిక్ ఇస్తున్నప్పటికీ మణిశర్మ ని ఎవరూ కూడా రీప్లేస్ చేయలేరని, కావున మహేష్, పవన్ ఇద్దరూ కూడా రాబోయే రోజుల్లో తమ సినిమాలకు మణిశర్మ ని మళ్ళి రిపీట్ చేయాలని వారు కోరుతున్నారు. మరి ఆ హీరోలిద్దరూ తమ అభిమానుల అభ్యర్ధనను ఎంతవరకు మన్నిస్తారో చూడాలి....!!