'పెళ్లి సందD' మొదటి పాట విడుదల..!

Suma Kallamadi

తెలుగు సినీ రంగంలో స్టార్ దర్శకుడైన రాఘవేంద్ర రావు దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే. ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. ఇక మరో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. 1996లో విడుదలైన పెళ్లిసందడి సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎప్పుడో 25 ఏళ్ళ క్రిందట చేసిన ఆ సందడి మళ్ళీ ఇప్పుడు నవతరం ప్రేక్షకలోకం కోసం నయా 'పెళ్లి సందD'గా రాబోతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసే సత్తా ఉన్న సంగీత దర్శకుడు కీరవాణి బాణీలు మరోసారి మంత్రముగ్దులను చేయబోతున్నాయి. మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇక పెళ్లి సందD హంగామా షురూ చేయాలని ఫిక్స్ అయిన రాఘవేంద్ర రావు.. ఏప్రిల్ 28న సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సినిమా నాటి ‘పెళ్లి సందడి’కి కొనసాగింపు చిత్రం కాదు.
ఇది సరికొత్త కథతో తెరకెక్కుతున్న మూవీ. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది అని ముందే ప్రకటించిన రాఘవేంద్ర రావు.. త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తోంది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 28 రాఘవేంద్రరావు కి చాలా విశిష్టమైన రోజు. అడవి రాముడు సినిమా ఈ తేదీన విడుదల కాగా తన ఖాతాలో మంచి రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా తన శిష్యుడు రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన బాహుబలి 2 సినిమా కూడా అదే తేదీన విడుదల కాగా మంచి సక్సెస్ ని అందించింది. దీంతో ఈ ప్రత్యేకమైన రోజునే పెళ్లి సందడి పాటలు విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారట. అందుకోసమే ఈరోజు మొదటి పాటను విడుదల చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: