హీ ఈజ్ సో స్వీట్ అంటూ ప్రభాస్ ను పొగుడుతున్న ముద్దుగుమ్మలు..!
రాజామౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా కోసం ఎక్కువ రోజులు కలిసి వర్క్ చేసిన అనుష్క అయితే ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. డార్లింగ్‌ను పుప్స్ అంటూ ప్రేమగా పిలుచుకునే స్వీటీ.. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే లంచ్ బాక్స్ గురించి కూడా చాలా సందర్భాల్లో చెప్పారు.
అంతేకాదు.. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కూడా డార్లింగ్‌ను ఆకాశానికెత్తేశారు. సాహో సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రభాస్‌ను చూసి మొహమాటస్తుడని అనుకున్నా.. కానీ ఒకసారి ఆయనతో పరిచయం అయ్యాక తెలిసింది.. హీ ఈజ్ సో స్వీట్ అని అంటూ ముద్దు ముద్దుగా చెప్పారు శ్రద్దా.. అప్ కోర్స్ కాంప్లిమెంట్ ఏదైనా.. డార్లింగ్ ఇంటి క్యారేజ్ గురించి మాత్రం ప్రతీ ఒక్కరు స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సిందే.
అయితే ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న మూడు సినిమాల్లో ముగ్గురు అందాల భామలతో కలిసి నటిస్తున్నారు ప్రభాష్. వీళ్లు కూడా ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్‌కు మిస్టర్ పర్ఫెక్ట్ అన్న సర్టిఫికేటే ఇస్తున్నారు. రాధేశ్యామ్‌లో ప్రభాస్‌తో జోడి కడుతున్న పూజా హెగ్డే… డార్లింగ్ ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. ఇటలీలో ఇండియన్ ఫుడ్ రుచి చూపించిన డార్లింగ్ గురించి తెగ పొగిడేస్తున్నారు. ఇక సలార్ బ్యూటీ శృతి హాసన్, ఆదిపురుష్ జోడి కృతి సనన్‌ల కామెంట్ కూడా అదే. పరిచయానికి ముందు కాస్త షై గయ్‌లా కనిపించినా.. ఒక్కసారి క్లోజ్ అయితే.. డార్లింగ్ సెన్సాఫ్ హ్యూమర్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే అంటూ కితాబిస్తున్నారు టాలెంటెడ్ గర్ల్స్.