జబర్దస్త్‌లో అనసూయ, రష్మీలకు షాక్.. అదరగొడుతున్న కొత్త జడ్జి..!

Chakravarthi Kalyan
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై నెంబర్ వన్ షో గా టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది జబర్దస్త్. ప్రతి వారం జబర్దస్త్ వస్తుంది అంటే చాలు తెలుగు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మరి.. పగలబడి నవ్వుతూ ఉంటారు. జబర్దస్త్ లో కమెడియన్స్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త స్కిట్లతో  అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారూ  అన్న విషయం తెలిసిందే. అయితే అప్పుడప్పుడు జబర్దస్త్ లో జడ్జిలు మారుతూ ఉంటారు.

మొన్నటి వరకు రోజా ఒక్కరు మాత్రమే జడ్జిగా ఉండగా ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంతోమంది జడ్జిగా వచ్చి... ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ప్రస్తుతం గాయకుడు మనో జడ్జిగా కొనసాగుతున్నారు. అప్పుడప్పుడు మరికొంత మంది కొత్త జడ్జీలు కూడా వచ్చి  బుల్లితెర ప్రేక్షకులు అందరిని  అలరిస్తూ ఉంటారు. ఆ మధ్య కొన్నాళ్లు ఇటీవల  సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మొదటి సినిమాతోనే ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న సంగీత ను  జబర్దస్త్ జడ్జ్ గా పిలిచారు. ప్రస్తుతం రోజాకు ఆపరేషన్‌ కావడంతో ఇంద్రజ జడ్జిగా వస్తున్నారు.

జబర్దస్త్ ఎపిసోడ్ ఆరంభంలో యాంకర్లు, జడ్జిలకు ఇంట్రో సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్‌లో యాంకర్లు అనసూయ, రష్మీ రెచ్చిపోతుంటారు.. గ్లామర్ ఒలకపోస్తుంటారు. అయితే ఇప్పుడు కొత్త జడ్జ్‌ ఇంద్రజ ఈ ఇద్దరు యాంకర్లకు పోటీ ఇస్తున్నారు. సీనియర్ నటి అయినా స్లిమ్ముగా కనిపిస్తూ తన అందాలతో అలరిస్తున్నారు ఇంద్రజ. కాస్త లావయిన అనసూయ, రష్మ కంటే వయస్సు ఎక్కువైనా ఇంద్రజే స్లిమ్ గా కనిపిస్తూ డామినేట్ చేస్తున్నారు. డాన్స్ మూవ్‌ మెంట్స్ కూడా పర్‌ఫెక్టుగా చేస్తూ కుర్ర యాంకర్లకు షాకిస్తున్నారు. ఈ ఇంద్రజ ఇంట్రో సాంగ్స్‌ చూస్తే మళ్లీ నిర్మాతలు ఇంద్రజకు అవకాశాలు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రోజా మళ్లీ వస్తారా.. లేక ఇంద్రజే కంటిన్యూ అవుతారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: