స్పీడ్ తగ్గిన సమంత ఈసారి ఏమైందబ్బా..!

Divya

సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత,  కేవలం వెండితెరపై కాకుండా ఓటీటీలో కూడా నటించి , తన సత్తా ఏంటో చూపుతోంది. " ఏ మాయ చేసావే " మూవీ లో నాగచైతన్య కు జోడిగా నటించి, తెలుగు తెరకు పరిచయమైంది సమంత. ఈ సినిమా మంచి సక్సెస్ ను  అందుకోవడంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ .. ఇక 2017వ సంవత్సరంలో నాగచైతన్య ,  సమంత ల వివాహం కూడా జరిగింది..

పెళ్లికి ముందు ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత , గడిచిన మూడేళ్ల నుంచి తక్కువ సంఖ్యలో సినిమాలలో  నటిస్తోంది. ఇక పెళ్లయిన తర్వాత మొదటిగా రామ్ చరణ్ తో కలిసి జోడీగా  రంగస్థలం సినిమాలో నటించి , ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే రంగస్థలం హిట్ అయినా స్టార్ హీరోలు మాత్రం తమ సినిమాల్లో సమంతను  హీరోయిన్ గా తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు..
ఇక మరోవైపు పెళ్లి తర్వాత గ్లామరస్ రోల్స్ కు దూరమై , సమంత కేవలం లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు  ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం భారత సినీ ఇండస్ట్రీలోనే రాని  ఒక  అద్భుతమైన కథతో రాబోతోన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఈమె నటిస్తోంది.  గుణశేఖర్ డైరెక్షన్ లో  తెరకెక్కుతోన్న శాకుంతలం అనే సినిమాలో ఈమె నటిస్తోంది. అయితే ఈమె సినీ కెరీర్ లో మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈచిత్రం ఉండబోతోంది.. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి . రుద్రమదేవి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం గమనార్హం..
ఇదిలా ఉండగా సమంతకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నప్పటికీ, ఈమె తనకు  మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలను మాత్రమే  ఎంపిక చేసుకోవాలని భావిస్తోందట. ఆ కారణం చేతనే సమంత సినిమాలను తగ్గించిందని సమాచారం. ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించకపోయినప్పటికీ యాడ్స్, బిజినెస్ ల ద్వారా సమంతకు బాగానే ఆదాయం చేకూరుతోందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: