ఆలోచనలో పడ్డ లావణ్య త్రిపాఠి.. కెరీర్ కోసమేనా?
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి గురించి అందరికీ తెలిసిందే. 2012లో అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల బ్యూటీ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాని, మారుతి కాంబినేషన్‌లో వచ్చిన భలే భలే మగాడివోయ్ చిత్రంతో అందరి దృష్టి ఆకర్షించింది. ఇక సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో కూడా తన నటనకు మంచి పేరోచ్చింది.తన అందం తో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ .. తను మోడలింగ్ రంగంలో మిస్ ఉత్తరఖండ్ గా గుర్తింపు పొందిన లావణ్య అక్కడి నుంచి సినీ పరిశ్రమ లో అడుగు పెట్టింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా లావణ్య త్రిపాటి ఎంతో బిజీగా ఉంటుంది.
2008లో మొదటిసారి అందాల రాక్షసి సినిమాలో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల రాక్షసి లావణ్య.. వరుస సినిమాలతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అంతే కాకుండా హిందీలో కొన్ని సినిమాలలో నటించిన లావణ్య తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీ గా ఉండే లావణ్య త్రిపాఠి తన అభిమానులతో ఎప్పుడు ముచ్చటేస్తుంది.
కెరీర్ మధ్యలో వరుస ఫ్లాప్‌లు పడ్డప్పటికీ.. ఏ మాత్రం డీలా పడకుండా తన జర్నీని కొనసాగిస్తోంది. ఈ ఏడాది సందీప్ కిషన్ సరసన ఏ1 ఎక్స్‌ప్రెస్, కార్తీకేయ సరసన చావు కబురు చల్లగాలో నటించగా.. ఆ రెండు చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో ఏ1 ఎక్స్ ప్రెస్ మంచి విజయాన్ని సాధించింది. అయితే ప్రస్తుతం దేనికోసమో ఆలోచిస్తూ ఉన్న ఫోటో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది. బహుశ అది కెరీర్ కోసమేమో. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది