కేవలం 11 రోజుల్లోనే తారక్ రికార్డుని బీట్ చేసిన బన్నీ....
దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇక ఈ మధ్యనే అంటే అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా 'పుష్ప రాజ్' పాత్రను పరిచయం చేస్తూ 'పుష్ప' చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ ను విడుదల చేశారు. గూస్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఎన్నో ఈ టీజర్లో ఉన్నాయి. దాంతో యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది 'పుష్ప' టీజర్.తాజాగా ఎన్టీఆర్ అరుదైన రికార్డుని బ్రేక్ చేసిందట 'పుష్ప' టీజర్. విషయంలోకి వెళితే..
'ఆర్.ఆర్.ఆర్' నుండీ వచ్చిన ఎన్టీఆర్ భీమ్ టీజర్ అయిన 'రామరాజు ఫర్ భీమ్' రికార్డులను 'పుష్ప' బ్రేక్ చేసిందట.టాలీవుడ్లో అత్యధికంగా 1.2 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించిన టీజర్ గా 'పుష్ప' సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.అంతకు ముందు ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ 40 రోజుల్లో క్రియేట్ చేసిన ఈ రికార్డుని 11 రోజుల్లోనే బ్రేక్ చేసింది 'పుష్ప' టీజర్.
అంతేకాదు 44+ మిలియన్ల వ్యూస్ ను నమోదు చేసిన ఘనత కూడా 'పుష్ప'దే కావడం విశేషం. అయితే ఇది పూర్తిగా బన్నీ స్థామినా అని చెప్పలేం. ఇది పక్కా సుకుమార్ స్థామినా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాజమౌళి గతంలో తనకు పోటీనిచ్చే డైరెక్టర్ సుకుమార్ అనే చెప్పాడు. అనుకున్నట్లుగానే సుకుమార్ రాజమౌళి కి గట్టి పోటీనే ఇస్తున్నాడు.