పవన్ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ పూజలు ..! ఎక్కడో తెలుసా..?

Divya

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల అభిమానులు వారి మాటలను,  తూచా తప్పకుండా పాటిస్తారు అనే సంగతి తెలిసిందే.. ఎందుకంటే వారి ఫేవరేట్ హీరో రికార్డుల విషయంలో, ముందువరుసలో ఉండాలని హీరోల అభిమానులు ఎప్పుడూ భావిస్తూనే ఉంటారు.. అయితే ఒక్కొక్కసారి అభిమానుల మధ్య మాటల యుద్ధాలు, ఆయా హీరోలకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుంటాయి. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కోలుకోవాలని పూజలు చేయడం గమనార్హం..

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పుట్టపర్తి లో మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని హనుమాన్ టెంపుల్ లో పూజలు చేయించడం,  ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం మహేష్ బాబు, పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే , ఇక ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ వెంటనే మహేష్ బాబు పై ఉన్న గౌరవం తో ఏకంగా పవన్ కోలుకోవాలని, పూజలు చేయడంతో ఇతర హీరోల అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు..

మహేష్ బాబు పెట్టిన పోస్టు వల్ల అభిమానుల మధ్య మంచి వాతావరణం ఏర్పడింది.. మరోవైపు కరోనా నుంచి పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నాడు. తాజాగా ఒక లేఖను విడుదల చేసిన పవన్ కళ్యాణ్   ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు సలహాలు, సూచనలు పాటిస్తున్నారని తెలిపారు.. ఇక అంతే కాకుండా త్వరగా కోలుకోవాలని సందేహాలు పంపిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపాడు.. ఇక అంతే కాకుండా మాటలతో తన భావోద్వేగాలను వెల్లడించలనని, త్వరలోనే ప్రజల ముందుకు వచ్చి ప్రజల కోసం నిలబడతానని పేర్కొన్నాడు..

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా మంచి స్నేహితుల గానే ఉంటారు. అలాగే ఒక్కొక్క స్టార్ హీరో  కొంత మంది అభిమానులు ఉండటం గమనార్హం.అయితే స్టార్ హీరోలు ఎంత స్నేహంగా ఉంటారో, వారి అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే,  మా హీరో గొప్ప అని ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ మధ్య గొడవలు  కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సమయాలలో.. అయితే ఇప్పుడు జరిగిన ఈ సంఘటన చూస్తే అక్కడ స్టార్ హీరోలు మాత్రమే స్నేహితులుగానే కాకుండా ఇక్కడ అందరి హీరోల అభిమానులు కూడా గొడవ పడకుండా సన్నిహితంగా ఉన్నారు అని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: