ప్రభాస్ జ్ఞాపకాలలో ఆచార్య !

Seetha Sailaja

కొరటాల శివను క్రేజీ డైరెక్టర్ గా మార్చిన మూవీ మిర్చి తను దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే కొరటాల సంచలన దర్శకుడిగా మారిపోయాడు. ఆమూవీ తరువాత కొరటాల తీసిన సినిమాలు అన్ని బ్లాకు బస్టర్ హిట్స్ కావడంతో రాజమౌళి తరువాత వరస బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన రికార్డు కొరటాల సొంతం అయింది.  


ప్రస్తుతం చిరంజీవితో హీరోగా కొరటాల శివ తీస్తున్న ‘ఆచార్య’  మూవీ పై  భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ ఇందులో కామ్రేడ్ సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న పరిస్థితులలో ఈమూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే మారేడుమిల్లి ఫారెస్ట్స్ మరియు గోదావరి ఖని షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన చరణ్ ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు.  


హైదరాబాద్ లో కోకాపేటలో వేసిన భారీ ధర్మస్థలి సెట్ లో ఈ సినిమాలు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.  ప్రస్తుతం కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నప్పటికి ఆవిషయాలను లెక్క చేయకుండా చరణ్ బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ లపై కొరటాల  భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో  ఈమూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం లీక్ అయింది.


గతంలో ‘మిర్చి’ సినిమాలో కొరటాల చిత్రీకరించిన రైన్ ఫైట్ లా ‘ఆచార్య’ లో కూడ వర్షంలో వచ్చే భారీ ఫైట్ సీన్స్ ఉంటాయని వార్తలు వస్తున్నాయి. రెయిన్ ఫైట్స్ లో బెస్ట్ గా నిలిచేలా కొరటాల దీనిని డిజైన్ చేసాడని అంటున్నారు. చరణ్ పై ప్లాన్ చేసిన ఫైట్ ఈమూవీకి హైలెట్ గా మారుతుంది అని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు  సంబంధించి చిరంజీవి రెజీనా లపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ చరణ్ పూజా హెగ్డే ల పై తీసిన మెలోడీ సాంగ్ అభిమానులను హుషార్ ఎక్కిస్తాయి అన్నవార్తలు ఉన్నాయి. లేటెస్ట్ పరిస్థితుల రీత్యా ఈ మూవీని మేలో కాకుండా ఈ సెకండ్ వేవ్ చల్లా రాక ఆగష్టు  రెండవ వారంలో విడుదల చేసే విధంగా  యాక్షన్ ప్లాన్ మారింది అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: