వకీల్ సాబ్ లెక్కలలో బయటకురాని నిజాలు ?

Seetha Sailaja

టాప్ హీరోల సినిమాలకు సంబంధించి కలక్షన్స్ వివరాలు బయటకు రాకుండా ఉండటం జరగని పని. అయితే ‘వకీల్ సాబ్’ మూవీ కలక్షన్స్ విషయంలో కొనసాగుతున్న టాప్ సీక్రెట్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ‘బాహుబలి 2’ ‘నాన్ బాహుబలి 2’ అంటూ వినిపించే లెక్కల హడావిడి ఈ మూవీ విడుదలై ఒక వారం పూర్తి అవుతున్నా ఎక్కడా లెక్కలకు సంబంధించిన గాసిప్పుల హడావిడి కూడ లేక పోవడం షాకింగ్ న్యూస్ గా మారింది.  

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా అంకెలు బయటకు రాకూడదని ముందుగానే తాళాలు వేసేసారు. అని టాక్ దీనికితోడు వైజాగ్ గుంటూరు కృష్ణ నైజాం ఏరియాలు నిర్మాత దిల్ రాజ్  స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు. అందువల్ల అక్కడి నుంచి కలక్షన్స్ ఫిగర్స్ ఎక్కడా లీక్ కావడం లేదు అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి మిగిలిన ఏరియాలు కూడా దిల్ రాజుకు అత్యంత సన్నిహితులకే ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  

అందువల్ల ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి పూర్తిగా రహస్యం కొనసాగించ గలుగుతున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ మూవీ కలక్షన్స్ భారీగా వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. క్రితం సంవత్సరం ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకు సంబంధించిన ఫిగర్లు ఎప్పటికప్పుడు అధికారికంగా బయటకు వచ్చాయి.  అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు.  

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ బయ్యర్లకు ఇప్పటివరకు తమ పెట్టుబడిని 60 శాతం వరకు రికవరీ చేసుకోగలిగారు అని టాక్. అయితే ఉగాది పండుగ కూడ అయిపోయిన నేపధ్యంలో ప్రస్తుతం పెరిగిపోతున్న కరోనా కేసుల భయాలను కూడ పక్కకు పెట్టి ప్రేక్షకులు ‘వకీల్ సాబ్’ పై ప్రేమ కురిపిస్తేనే ఈ మూవీ బయ్యర్లు గట్టేక్కగలుగుతారు. ఈ మూవీకి ఉగాది రోజు తరువాత వచ్చిన బుధవారం కలక్షన్స్ పరంగా పెద్దగా సహకరించలేదు అన్న లీకులు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: