మాటల మాత్రింకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో తీయబోతున్నారని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ దాదాపు సినిమా కన్ఫామ్ అయింది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఆ తరవాత అయినా ఈ సినిమా ఉంటుందో లేదో క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిన వెంటనే ఎన్టీఆర్ కొరటాల సినిమా పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా తీస్తారన్న ప్రశ్న మాటల మాంత్రికుడి అభిమానుల్లో నెలకొంది. కాగా ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సిల్ అయినప్పటికీ త్రివిక్రమ్ మరో స్టార్ హీరోనే లైన్ లో పెట్టినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు తో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి .
అంతే కాకుండా ఈ చిత్రాన్ని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు జీఎం బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిమించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడీగా పూజా హెడ్గే నటించబోతుందట. అంతే కాకుండా మే 31న ఈ చిత్రం పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో అతడు సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరోవైపు వీరి కాంబినేషన్ లో ఖలేజా సినిమా వచ్చింది. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు కానీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన చిత్రంగా నిలిచిపోయింది. ఇక త్రివిక్రమ్ మహేశ్ బాబు సినిమా పై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ఉండబోతుంది.ఇక ఈ సినిమా పట్టాలెక్కుతుందా.? లేదా అన్నది తెలియాలంటే మే 31 వరకు ఆగాల్సిందే.