స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరొకసారి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టారనే చెప్పాలి. ఈయన వకీల్ సాబ్ మూవీ సాంగ్స్‌లోనూ, ఫైట్లలోనూ, ఎమోషనల్ సీన్లలోనూ లౌడ్ ఎంత కావాలో అంతే ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ఎంట్రీ సీన్ లో థమన్ అందించిన సంగీతం పూనకాలు తెప్పించిందంటే అతిశయోక్తి కాదు. పలు చోట్ల థమన్ అందించిన నేపథ్య సంగీతం హృద్యంగా సాగింది. మంచి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన వకీల్ సాబ్ చిత్రం థమన్ సంగీతం తో మిళితమై ప్రేక్షకుల మనసులను అమాంతం హత్తుకుంది.
పవన్ కల్యాణ్ అమోఘమైన నటనకు అద్భుతమైన సంగీతం అందించిన థమన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అల వైకుంఠపురములో సినిమాకి థమన్ అందించిన సంగీతం ఒక లెవలయితే.. వకీల్ సాబ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మగువా మగువా పాట థియేటర్స్ లో ప్లే అయ్యే సమయంలో ఆడియన్స్ నిల్చొని చప్పట్లు కొడుతూ నానా హంగామా చేశారు. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో శివతాండవం చేశారని చెప్పుకోవచ్చు. కోర్టులో పవన్, ప్రకాష్ రాజు మధ్య కొనసాగే సన్నివేశాలకు సన్నివేశాలకు థమన్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. లాయర్ పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడంలో థమన్ సంగీతం కీ రోల్ ప్లే చేసింది.
ఇకపోతే 3 సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ తారాగణంలో తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రాన్ని అభిమానుల కోసం స్పెషల్ గా ఉదయం 4 గంటలకు ప్రీమియర్ షోలు వేశారు. ఐతే ప్రీమియర్ షోను వీక్షించిన ప్రేక్షకుల నుంచి అన్ని పాజిటివ్ రివ్యూసే వస్తున్నాయి. వరిజినల్ సినిమా లోని మెయిన్ పాయింట్ కొంచెం కూడా పాడవకుండా జెన్యూన్ గా ఒక మంచి రీమేక్ సినిమా తీశారని.. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినా.. వకీల్ సాబ్ ఒరిజినల్ పింక్ సినిమాకి ఏమాత్రం తీసిపోదని పాజిటివ్ టాక్ సర్వత్రా వినిపిస్తోంది.