అక్షయ్ కుమార్ నుండి సీక్రెట్ కాల్స్..కంగనా షాకింగ్ కామెంట్స్.!
నీకు నటనలో ఎవరూ సాటిలేరని కొనియాడారు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సైతం కంగన నటనను ప్రశంసించారట. అయితే అక్షయ్ తనకు సీక్రెట్ గా ఫోన్ చేసి ట్రైలర్ బాగుందని..నటన చింపేశావని అన్నారట. ఈ విషయాన్ని కంగన చెబుతూ అక్షయ్ తనకు సీక్రెట్ గా కాల్ చేసి తలైవి ట్రైలర్ బాగుందని చెప్పినట్టు తెలిపింది. బహిరంగంగా తనను ప్రశంసిస్తే మాఫియాతో సమస్యలు వస్తాయని అందుకే తనకు సీక్రెట్ గా ఫోన్ లు చేసి ప్రశంసిస్తారని తెలిపింది. అంతే కాకుండా దీపికా పదుకునే అలియా భట్ లను అయితే బహిరంగగంగా ప్రశంస్తారని కంగన చెప్పడం ఆశ్చర్యకరం. ఇదంతా మాఫియా మహిమ అంటూ కంగనా బాంబు పేల్చింది. అక్షయ్ తో పాటు మరికొందరు హీరోయిన్ లు కూడా తనకు ఫోన్ లు చేసి ట్రైలర్ బాగుందని చెప్పినట్టు తెలిపింది. బాలీవుడ్ లో స్నేహ పూర్వకంగా లేరని ఆవేదన వ్యక్తం చేసింది. కళల విషయంలో రాజకీయాలకు వెల్లకూడదని క్వీన్ హితవు పలికింది.