చిత్రం 1.1 లో నటించబోయేది ఎన్టీఆర్ బావమరిది కాదా.. మరి ఎవరు.??
నిన్న మొన్నటి వరకు ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బామ్మర్థి అయిన నితిన్ చంద్ర హీరోగా పరిచయం అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో ఎన్టీఆర్ బావమరిదికి బదులుగా వేరే హీరో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అతను మరెవరో కాదు. తేజ కొడుకు అమితోవ్ తేజ. స్వయంగా తన కొడుకునే ఈ సినిమాలో హీరోగా పరిచయం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అమితోబ్ తేజ ఒకటి రెండు సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు. ఇప్పుడు అమితోవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఎంతో మంది నటీ నటులను వెండి తెరకు పరిచయం చేసిన తేజ ఇప్పుడు తన కొడుకునే తన సినిమా ద్వారా పరిచయం చేయడం విశేషం అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఈనెల 18న జరుగబోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ చిత్రంలో నటించే హీరో గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
చిత్రం ప్రారంభోత్సవం సందర్బంగా సినిమా హీరో ఎవరు అనే విషయమై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.దర్శకుడు తేజ ఈమద్య కాలంలో తీసిన సినిమాలు అన్నీ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో తేజకు ఈ సినిమా చాలా కీలకంగా మారింది.ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ చేయడం అంటే మాటలు కాదు.. ఎంతో జాగ్రతగా అడుగులు వేయాలి. అందులోను స్వయంగా తేజ కొడుకు ఈ సినిమాలో నటిస్తుండడంతో ఆచి తూచి అడుగులు వేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది. చిత్రం 1.1 పూర్తి వివరాలు మరి కొన్ని రోజుల్లో తెలవనున్నట్లు సమాచారం.. !!