ఆ ఇద్దరిలో ఎవరితో సినిమా చెయ్యాలో తెలీక కన్ఫ్యూజన్ లో పడ్డ చిరు....

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సుధీర్ఘ రాజకీయ జీవితం తరువాత వరుస సినిమాలు చేస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ దగ్గర నాలుగు సినిమాలున్నాయి. అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ 'ఆచార్య' చివరి దశకొచ్చింది. ఇక త్వరలో 'లూసిఫర్‌' రీమేక్‌ మొదలవుతుంది. తమిళ దర్శకుడు మోహన్‌రాజా ఈ సినిమాకు డైరెక్టర్. దీంతో ఇద్దరు దర్శకుల లెక్క తేలింది.ఇక మరి మిగిలిన ఇద్దరి లెక్కో? అదే ఇప్పుడు సమస్య.చిరంజీవి దగ్గరున్న ఇద్దరు దర్శకులు మెహర్‌ రమేష్‌, బాబి. మెహర్‌ రమేష్‌తో 'వేదాళం' రీమేక్‌ చేస్తానని చిరంజీవి ఇప్పటికే ప్రకటించారు. ఇక దీని పనులు మొదలయ్యాయని కూడా చెప్పారు.


ఇక బాబీ సినిమా పరిస్థితి ఏంటి అనుకుంటున్న సమయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో బాబీ సినిమా ఉంటుందని ప్రకటించి… హమ్మయ్య అనిపించారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరి సినిమా ముందు మొదలవుతుంది. ఇక ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గరా లేనట్లుంది.ఇక బాబీ డైరక్షన్‌లో రాబోయే సినిమా స్ట్రయిట్‌ మూవీనా, రీమేకా అనేది తెలియడం లేదు. అజిత్‌ 'ఎంతవాడు గానీ' సినిమాను రీమేక్‌ చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆ ఊసు లేదు. దీంతో కొత్త కథే అనుకుందాం. మరి కథ ఓకే అయ్యిందా… ఎప్పుడు స్టార్ట్‌. ఈ కథ ఓకే అయ్యేలోపు 'వేదాళం' రీమేక్‌ ప్రారంభిస్తారా? అనేదీ తెలియడం లేదు.ఇక మరి చిరంజీవి ఏ సినిమా చేస్తాడో తెలీక ఆయన కూడా కన్ఫ్యూజన్ లో వున్నాడట. ఇక ప్రస్తుతానికి అయితే ఆచార్య, లూసిఫర్ ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నాడు మెగాస్టార్...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: