నా ప్రేయసి కోసం 7 స్కూళ్ళు మారాను : సింగర్ యశస్వి
ఇక తాను పైలెట్ అవ్వాలని చిన్నప్పటి నుండి కలలు కన్నానని కానీ జాను కోసం బైపీసీ లో చేరినట్టు తెలిపాడు. అంతే కాకుండా తన ప్రేమ విషయం ఇంట్లో ముందు నుండి తెలుసనని కానీ ఏదో సరాదాగా అనుకున్నారే కానీ ఇంత సీరియస్ అనుకోలేదని తెలిపారు. ఇక తన ప్రేయసి జానుని మొదట టీవీషోలో పరిచయం చేయాలనుకున్నప్పుడు ఇంట్లో చెప్పినట్టు తెలిపాడు. అయితే తన తల్లి దండ్రులు ఇప్పుడే అందరీకి తెలియడం అవసరమా అన్నారని చెప్పాడు. అంతే కాకుండా జాను ఇంట్లో చెబితే పబ్లిక్ గా బయటపడటం ఎందుకని అన్నారని చెప్పాడు. అయితే తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని తెలిస్తే తప్పేముందని తల్లి దండ్రులకు వివరించానని తెలిపారు. కానీ తల్లి దండ్రులు చెప్పినా మేం అవన్నీ వినకుండా షో ప్రేమించుకుంటున్నామని ప్రకటించినట్టు తెలిపాడు. దాంతో తమ ప్రేమవిషయం జీతెలుగు ద్వారా అందరికీ తెలిసిపోయిదని అన్నారు.