జూనియర్ చిరంజీవి ఆగటం లేదుగా.. ఇప్పుడు మరోసారి..?

praveen
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లోకి ఎంతో మంది కొత్త హీరోలు వస్తున్నారు పోతూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి కొన్ని సినిమాలతోనే ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు ఇంద్ర సినిమాలో జూనియర్ చిరంజీవి గా నటించి బాల నటుడిగానే ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న తేజ సజ్జ ఇక ఇప్పుడు ఏకంగా హీరోగా మారిపోయాడు. ఓ బేబీ సినిమా తో ఒక కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ ఇక ఇటీవల జాంబి రెడ్డి సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి జాంబీ మూవీ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 ఈ క్రమంలోనే ఇది తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతగానో ఆకర్షించి సినిమా మంచి ఆదరణ పొందింది. దీంతో ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు తేజ. సాధారణంగా ఒక సినిమా విజయం సాధించింది అంటే చాలు ఇక మరో సినిమా  చేసేందుకు సిద్ధమవుతున్నారు హీరోలు. ఇక ఇప్పుడూ తేజ కూడా ఇదే రూట్ ఫాలో అవుతున్నట్లు. జాంబి రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న తేజ సజ్జ ఇక ఇప్పుడు కన్ను గీటు తో కుర్రకారు మతి పోగొట్టి ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ప్రియ వారియర్ తో కలిసి ఇష్క్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

 మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ చిత్రబృందం శరవేగంగా నిర్వహిస్తుంది. కాగా ఇటీవలే తేజ  ప్రియా ప్రకాష్ వారియర్ ఇద్దరు కూడా క్యాష్ షో లో భాగంగ గెస్ట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ లో ఇద్దరూ ఎంతో సందడి చేసారు. ముఖ్యంగా జూనియర్ చిరంజీవే గా గుర్తింపు సంపాదించుకున్న తేజ సత్య తనదైన స్టయిల్ లో పంచులు వేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్వించారు.  ఇక పోతే జూనియర్ చిరంజీవి పాత్రలో నటించి బాలనటుడిగానే ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న తేజ ఇక ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు అని అంటున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: