ఆ సినిమా టైటిల్ కోసం గొడవపడ్డ ఎన్టీఆర్, కృష్ణ... చివరికి ఏమైందంటే..?

kalpana
సినిమా ఇండస్ట్రీలో సినిమా తీయాలంటే ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సినిమాలు తీయడం ఎంత ముఖ్యమో, ఆ సినిమా విజయవంతం కావాలంటే సినిమాకు తగ్గట్టు టైటిల్ పెట్టడం కూడా అంతే ముఖ్యం. ఈ విధంగా సినిమా టైటిల్స్ విషయంలో ఎంతో మంది ఎన్నో సార్లు గొడవ పడటం గురించి మనం వినే ఉంటాం. అచ్చం ఇలాంటి గొడవే 1987లో ఒక టైటిల్ కోసం సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య వివాదం తలెత్తింది. అది కూడా వీరిద్దరూ తమ కొడుకుల సినిమా కోసం గొడవ పడడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
1987 లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి జంటగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమాకు "సామ్రాట్"అనే టైటిల్ ను చిత్రబృందం ఫిక్స్ చేసి అందుకు సంబంధించిన పోస్టర్లను, రిలీజ్ తేదీలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేస్తూ సామ్రాట్ అనే సినిమాను నిర్మించాడు. అయితే బాలకృష్ణ నటించిన సినిమా సామ్రాట్,రమేష్ బాబు నటించిన సినిమా టైటిల్ కూడా సామ్రాట్ కావడంతో ఎన్టీఆర్, కృష్ణల మధ్య టైటిల్ వివాదం తలెత్తింది.                                             
ఇద్దరు టైటిల్ నాదంటే నాది అని గొడవ పడ్డారు. చివరకు ఎన్టీఆర్ ఒక అడుగు వెనక్కి వేస్తూ బాలకృష్ణ నటించిన సినిమాకి "సాహస సామ్రాట్"అనే టైటిల్ పెట్టి తన హుందాతనాన్ని చాటుకున్నారు. ఇక ఈ రెండు సినిమాలు విడుదల కావడంతో బాలకృష్ణ, విజయశాంతి నటించిన సాహస సామ్రాట్ బాక్సాఫీస్ దగ్గర మోస్తారు కలెక్షన్లను  రాబట్టగా, రమేష్ బాబు నటించిన సామ్రాట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: