టాలీవుడ్ గాసిప్స్: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..!

Divya

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆయన తన తాత లాగే యాక్టింగ్ చేస్తుంటాడని సినీ ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు. అయితే సినిమాల్లో చాలా రోజులుగా ఉంటున్న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పుడూ చర్చ సాగుతూనే ఉంటుంది. ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు.. ఎలా వస్తారు.. అనే కోణంలో పలు చానల్లో డిబేట్లు కూడా సాగుతున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న  RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.జెమినీ టీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం లో హోస్టు గా చేయబోతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఓ సమావేశంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై హాట్ కామెంట్స్ చేశాడు.
ఓ అభిమాని తో (NTR)మాట్లాడుతూ చమత్కారంగా ఇలా మాట్లాడారు.అభిమాని 'మీరు రావాలి.. లీడర్ కావాలి 'అని అడిగుతూ..పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది.. అని అడిగాడు. కానీ వస్తానని  క్లారిటీగా చెప్పలేదు. ముందుగా దీనికి ఆన్సర్ మీరే చెప్పండి అని ఎన్టీఆర్  అభిమానిని అడిగారు. దీంతో అభిమానులు మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అన్నారు.అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ ఇది సరైన సమయం కాదు.. సందర్భం వచ్చినప్పుడు మంచి వేడి కాఫీ పెట్టుకొని మాట్లాడుకుందామని చమత్కారంగా సమాధానమిచ్చారు.

ఇక మరో అభిమాని అయితే మీ పొలిటికల్ స్పీచ్ అయినా ,సినిమాలో డైలాగ్ అయినా బాగా ఉంటాయని అన్నారు. ఇందులో మీకు సంబంధించినంత వరకు కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందని అడిగారు.  కానీ ప్రజలతో ఎలా మాట్లాడాలో అది ఉండదు. ఇక షో విషయానికొస్తే "ఫర్ ద షో .. ఆటను ఎలా ఆడాలో.. ఒక ఫర్మాట్ ఉంటుంది. కానీ ప్రజలతో ఎలా మాట్లాడాలో అది ఉండదు. షో విషయానికొచ్చేసరికి ఓ పర్సన్ జీవితంలో ఏముంది..? అనేది కోశ్చన్ చేయగలుగుతాం ?  కానీ ప్రజల్లో వెళ్లేసరికి ప్లానింగ్ అనేది ఉండదు అని సమాధానమిచ్చారు.
దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులు,  త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని,దానికి ఒక సమయం ఉంటుంది అని చెప్పడంతో ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాము అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే పోస్టులు పెడుతున్నారు.అయితే మరోవైపు ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల వరకైనా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: