100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్న నాగార్జున..

Suma Kallamadi
నట సామ్రాట్ అక్కినేని నాగార్జున 97వ చిత్రం వైల్డ్ డాగ్ విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 2వ తారీఖున విడుదల కానున్న ఈ చిత్రం యొక్క ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 2 గంటల 25 నిమిషాల పాటు కొనసాగనున్న ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ హైదరాబాద్ లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు నేపథ్యంలో రూపొందింది. 2007లో గోకుల్ చాట్ లో జరిగిన బాంబు పేలుళ్ల గురించి కూడా ఈ సినిమాలో వీక్షించవచ్చు. వైల్డ్ డాగ్ లో అక్కినేని నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించి అలరించనున్నారు. అహిషోర్‌ సాల్మన్‌ ఇచ్చిన వైల్డ్ డాగ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే నాగార్జున కెరీర్ లో 98వ చిత్రంగా బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు రానున్నది. కళ్యాన్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానున్నది. బంగార్రాజు మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నారు. అయితే నాగార్జున 100వ చిత్రంపై ఇప్పటికే అనేక చర్చలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం నాగార్జున తన తనయుడు అక్కినేని అఖిల్ తో కలిసి తన 100వ చిత్రాన్ని ప్లాన్ చేయనున్నారట. తన 100వ చిత్రం లో అఖిల్ కి ఫాదర్ క్యారెక్టర్ లో నటించాలని నాగార్జున అనుకుంటున్నారని.. అందుకు తగ్గట్టుగా ఒక స్క్రిప్ట్ తయారు చేయడానికి పలు రచయితలు ముందుకు వచ్చారని సమాచారం.

మనం సినిమాలో నాగార్జున నాగచైతన్య కలిసి నటించారు కానీ అఖిల్ తో కలిసి ఆయన ఏ సినిమా చేయలేదు. అందుకే తన 100వ చిత్రం లో అక్కినేని అఖిల్ తో కలిసి ఫుల్ లెన్త్ మల్టీస్టారర్ మూవీ చేయాలని టాలీవుడ్ కింగ్ యోచిస్తున్నారు. మరి నాగార్జున ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చేస్తారో ఇంకా మరేదైనా సరికొత్త జానర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: