స్టేజ్ మీదే అదిరిపోయే ఆఫర్ ఇచ్చేసిన నితిన్.. ఫ్యాన్స్ షాక్..?

praveen
ఈ మధ్యకాలంలో కొత్త సినిమాలు వస్తున్నాయంటే చాలు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలలో ఇక ఆయా సినిమాలకు సంబంధించిన హీరోహీరోయిన్లు వెళ్లడం ప్రమోషన్స్ నిర్వహించడం లాంటివి చేస్తున్నారు అన్నది చూస్తూనే ఉన్నాం. అయితే మరికొన్ని రోజుల్లో నితిన్ హీరోగా నటించిన రంగ్ దే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక మార్చి 26వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఇక ఈ సినిమాలో నితిన్ సరసన మొదటిసారి  కీర్తి సురేష్ నటిస్తోంది.



 ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ఈ సినిమా ఎలా ఉంటుందో అనే దాని పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే చిత్ర బృందం శరవేగంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి నితిన్ స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే హోలీ సందర్భంగా ఈ ఎపిసోడ్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక నితిన్ ఎంట్రీ ఇవ్వగానే మిమ్మల్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లుగా అనిపిస్తుంది అంటూ సుడిగాలి సుదీర్ నితిన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు.



 ఇక ఆ తర్వాత నితిన్ పక్కన కూర్చుని పర్ఫామెన్స్ అన్ని చూస్తున్న సమయంలో నితిన్ సినిమా లోని ఏమైందో ఏమో ఈ వేళ అనే పాట పై ఒక డాన్స్ మాస్టర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. అతను డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నంతసేపు నితిన్ కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు. ఇక పర్ఫామెన్స్ అయిపోయిన తర్వాత స్టేజి మీదికి వచ్చి నీ పర్ఫామెన్స్ నాకు ఎంతో నచ్చింది.. ఎంత నచ్చింది అంటే త్వరలో నీతో వర్క్ చేయాలని ఉంది అంటూ నితిన్ ఏకంగా అక్కడ డాన్స్ మాస్టర్ కి బంపర్ ఆఫర్ ఇస్తాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: