"శశి" రెండ్రోజుల్లో ఎంత రాబట్టిందంటే....

Purushottham Vinay
హీరో ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ యాక్టర్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు. "ప్రేమకావాలి" సినిమాతో హీరోగా పరిచయమయ్యి ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత "లవ్ లీ " సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.కాని తన తండ్రి లాగా మంచి నటుడిగా గుర్తింపు పొందలేకపోయాడు. యాక్టింగ్ బాగున్నా కాని కథల విషయంలో సరిగ్గా కుదరక వరుస ప్లాపులు మూటగట్టుకున్నాడు. ఇక ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కోసం "శశి" ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో సురభి హీరోయిన్ గా నటించింది.శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.'శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్' పతాకంపై ఆర్‌.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. అరుణ్ చిలువేరు సంగీతంలో రూపొందిన 'ఒకే ఒక లోకం' అనే పాట సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేసింది.కానీ ఆ అంచనాలను ఈ చిత్రం మ్యాచ్ చెయ్యలేకపోయింది అనే చెప్పాలి.

ఇక ఇప్పటిదాకా ఈ సినిమా ఎంత వసూళ్లు రాబట్టిందంటే...ఇక 'శశి' చిత్రానికి 3.2కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 3.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 0.30కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 3.20 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మరి అంత రాబుతుందో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: