నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక జక్కన్న, కీరవాణి ఉన్నారు : ఎన్టీఆర్
నాకు 20 ఏళ్ల నుంచి దేవుడి ఇచ్చినట్టువంటి శక్తి మీరైతే.. నాకు తెలిసిన ఒకే ఒక కుటుంబం కీరవాణి, జక్కన్న కుటుంబం. నేను తీసుకునే ప్రతీ ఒక్క నిర్ణయం వెనక వాళ్లే ఉన్నారు. ఈ కుటుంబానికి నేను ఎప్పుడూ గెస్ట్‌ను కానూ కాకూడదు.. వారికి కూడా నేను అలా కాకూడదు. నిర్మాత సాయి గురించి కూడా అంతే ఫీలవుతున్నాను. సాయి అన్నతో 30 ఏళ్ల పరిచయం ఉంది. నాన్న గారితో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. ఆయన గురించి, సక్సెస్ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మన అనుకున్న వాళ్ల గురించి ఎక్కువగా మాట్లాడలేం. సినిమా సక్సెస్ అవ్వాలి.. మా భైరవ, సింహలకు ఇంకో మెట్టు ఎక్కేలా ఈ మూవీ దొహదపడాలి. ఈ మూవీ హిట్ అవ్వాలి.. దర్శకుడికి సక్సెస్ రావాలి.. సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి తల్లిదండ్రులం అని ఎలా అనిపించుకోవాలి.. పిల్లలను ఎలా మంచిగా పెంచాలని ప్రణీత, నేను రోజూ అనుకుంటూ ఉంటాం. ఆ ఇద్దరూ (సింహా, భైరవ) ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం మా వళ్లమ్మ, రమమ్మ. ప్రతీ కొడుకు సక్సెస్ వెనకా ఓ తల్లి ఉంటుంది.. మా పిల్లలకు ఉదాహరణగా చెప్పుకోవడానికి వీళ్లున్నారు. సింహా, భైరవకు సినిమాల పరంగానే విజయాలు కాకుండా రేపు వచ్చే యువతకు ఆదర్శంగా ఎదగాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం’ అంటూ వ్యాఖ్యానించారు.