పారితోషికం భారీగా పెంచేసింది వంటలక్క.. ఎంతో తెలుసా..?

praveen
సాధారణంగా సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం వచ్చి ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  అలాంటి ట్రెండ్ సెట్ చేసిన సినిమాలని ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అయితే కేవలం వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఇలా ట్రెండ్ సెట్ చేసే సీరియల్స్ ఉంటాయి అన్నది కార్తీకదీపం సీరియల్ తో నిజం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అప్పటి వరకు ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి పోతున్నాయి  కానీ మునుపెన్నడూ లేని విధంగా బుల్లితెర పై సరికొత్త చరిత్ర సృష్టించి టాప్ రేటింగ్ ను సొంతం చేసుకొని..  అన్ని వర్గాల బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షింఛీ ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది కార్తీకదీపం సీరియల్.

 ఏ ముహూర్తాన కార్తీకదీపం సీరియల్ మాటీవీలో ప్రసారం అయిందో కానీ.. ఇప్పటికే 1000 ఎపిసోడ్ వరకూ వచ్చేసింది. అయినా ఎక్కడ ఈ సీరియల్ కి మాత్రం క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి.  ఇక కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ ఒక్క సీరియల్ తోనే ఏకంగా హీరోయిన్ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది.  అయితే ఇప్పటికే 992 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న కార్తీకదీపం సీరియల్ మరికొన్ని రోజుల్లో 1000 ఎపిసోడ్ ల మైలురాయిని చేరుకుంటుంది. ఇక కార్తీకదీపం సీరియల్ మొత్తాన్ని కూడా వంటలక్క కేవలం ఒంటి చేత్తో ముందుకు నడిపిస్తుంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.

 అయితే బుల్లితెరపై ఎన్ని రకాల కార్యక్రమాలు వచ్చినప్పటికీ వాటిని ప్రక్కనపెట్టి కార్తీకదీపం సీరియల్ చూడడానికి బుల్లితెర ప్రేక్షకులు ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నారు. అయితే కార్తీకదీపం సీరియల్ లో ఎంతగానో క్రేజ్ సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ కి పారితోషికం ఎంత ఇస్తారు అన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు.  ప్రేమి విశ్వనాథ్ ఇక ప్రస్తుతం  కార్తీకదీపం  సీరియల్ లో భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కు రెండు లక్షల వరకు ప్రేమి విశ్వనాథ్ పారితోషకం తీసుకుంటుందట. ఇక ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ 1000 ఎపిసోడ్ ల మైలురాయిని అందుకోబోతున్న నేపథ్యంలో రెమ్యూనరేషన్ పెంచాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు లక్షల కావాలని డిమాండ్ చేస్తూ ఉందట. కాగా ప్రేమి విశ్వనాథ్ అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: