సుడిగాలి సుదీర్ పెళ్లి.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..?

praveen
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మీ జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  వీరిద్దరి గురించి సోషల్ మీడియా వేదికగా వెతికారు అంటే చాలు ఎన్నో రకాల స్టోరీలు బయటకి వస్తూ ఉంటాయి.  జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇక యాంకర్ గా ఉన్న రష్మీ కి లైన్ వేయడంతో వీరీ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అని భావించారు ప్రేక్షకులు. అయితే తామిద్దరం మంచి స్నేహితులం అని ఎన్నోసార్లు ఇద్దరు క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం వీరిద్దరు నిజంగానే ప్రేమికులు అని ఫిక్స్ అయిపోయారు.  అదేంటోగాని వీళ్లు స్నేహితులం అని చెబుతూ ఉంటారు తప్ప వీరు ఒక్కసారి స్టేజిపై కనిపించారు అంటే వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.

 ఇలా జబర్దస్త్ లో మొదలైన వీరి లవ్ ట్రాక్ కాస్త ఈటీవీ లో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలకు పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ రష్మీ అంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ మురిసిపోతూ ఉంటారు.  నిజంగానే సుడిగాలి సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటుంది అంటూ ప్రేక్షకులు కోరుకుంటున్నారూ అన్న విషయం తెలిసిందే.  ఇకపోతే ఇటీవలే సుధీర్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కాగా అటు రష్మి సుదీర్ దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది.  అయితే ఇదంతా జరిగింది నిజజీవితంలో కాదు కేవలం జబర్దస్త్ స్కిట్ లో భాగంగా.

 ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  సాధారణంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్ తో తెర మీదికి వచ్చే సుడిగాలి సుదీర్  టీమ్ ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్తో వచ్చింది.  ఈ క్రమంలోనే ఇక సుడిగాలి సుదీర్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవ్వగా ఆ పెళ్లి చెడగొట్టాలని భావిస్తారు స్నేహితులు రాంప్రసాద్ గెటప్ శ్రీను లు.  ఈ క్రమంలోనే రష్మిని సుదీర్ దగ్గరికి పిలుస్తారు..  ఏదో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే చూసావా వారిద్దరి మధ్య లవ్ ఉందని ఒకరిని ఒకరు విడిచి పెట్టలేక ఆ అమ్మాయి చూడు ఎలా కన్నీళ్ళు పెట్టుకుంటుందో అంటూ ఇక సుధీర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కి చాడీలు చెబుతూ ఉంటారు రాంప్రసాద్ గెటప్ శ్రీను లు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: