ఆ విషయంలో అందరికీ మహేష్ బాబు, చిరంజీవే కావాలట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అయితే ప్రచార కార్యక్రమాల కోసం చిన్నపాటి దర్శక నిర్మాతలందరూ కూడా చిరంజీవి, మహేష్ లను ఆశ్రయించడానికి గల కారణం వాళ్ళిద్దరూ లక్కీ అని భావించడమే. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి లేదా ఆడియో ఫంక్షన్ కి బడా హీరోలను పిలవడం కూడా పరిపాటి అయ్యింది. మహేష్ బాబు ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రావడానికి అంగీకరించడం లేదు కానీ ట్రైలర్లు విడుదల చేయడానికి గాని లేదా పాజిటివ్ పాజిటివ్ సోషల్ మీడియా పోస్టులు పెట్టడానికి గాని అభ్యంతరం తెలపడం లేదు. చిరంజీవి కూడా ట్రైలర్లను, టీజర్లను విడుదల చేస్తూ ఇతర హీరోల సినిమాలను బాగా ప్రచారం చేస్తున్నారు. 3 వారాల క్రితం ఆయన మోసగాళ్ళు ట్రైలర్ విడుదల చేశారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి నటిస్తున్న విరాట పర్వం సినిమా టీజర్ ని కూడా మార్చి 18 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేశారు. దీంతో ఆ సినిమాలపై సహజంగానే అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇకపోతే పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇతర సినిమాలను ప్రమోట్ చేసి ఆశ్చర్యపరిచారు. చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ప్రచారం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.