నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన..విడుదల తేది ఖరారు..!!
ఉప్పెన ఈనెల 24న స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.దీంతో మరోసారి ఈ సినిమాను మరోసారి మోబైల్స్‌లో చూడోచ్చిని మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. వైష్ణవ్ తేజ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను చేశాడు. ఈ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కించాడు క్రిష్. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ఈ నవలను సినిమాగా తెరకెక్కించేందుకు కథలో కొన్ని మార్పులను చేశాడట క్రిష్.ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసిందట. ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తో రూపొందింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మాలని ముందుగా అనుకున్నారట దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు ఉప్పెన భారీ హిట్ కావడంతో తమ ఆలోచనను మార్చుకొని థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది..!!