పవన్ చరణ్ లకు షాక్ ఇచ్చిన నితిన్ వ్యాఖ్యలు !

Seetha Sailaja


పవన్ కళ్యాణ్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడుగా నిరంతరం పవన్ పై అభిమానాన్ని ప్రదర్శించే నితిన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ చరణ్ లపై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తాను నిర్మిస్తున్న ‘అఖిల్’ సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ వస్తున్నాడు అన్న వార్తల పై స్పందిస్తూ పవన్ ను ఆ ఆడియో ఫంక్షన్ కు తాను ఆహ్వానించలేదని అటువంటి సందర్భంలో పవన్ ఆ ఫంక్షన్ కు వచ్చే ప్రశక్తి ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించాడని తెలుస్తోంది. 

ఇదే సందర్భంలో పవన్ గురించి మాట్లాడుతూ తనకు పవన్ తో సినిమా తీసే అవకాశం వస్తే ప్రస్తుతం తాను నటిస్తున్న, తీస్తున్న సినిమాలను అన్నీ ఆపు చేసి తన దృష్టి అంతా పవన్ సినిమా పైనే పెడతాను అంటూ మరోసారి పవన్ పై తన భక్తిని చాటుకున్నాడు నితిన్. ఇదే సందర్భంలో చరణ్ ‘బ్రూస్ లీ’ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా విడుదలైన వారం రోజుల తరువాత అఖిల్ సినిమా విడుదల అవుతోందని వారం రోజుల గ్యాప్ తో వస్తున్న తమ సినిమాకు ‘బ్రూస్ లీ’ కి పోటీ ఎందుకు ఉంటుంది అంటూ కామెంట్స్ చేసాడు నితిన్. 

అంతేకాదు విడుదల అయ్యే ప్రతి సినిమాకి ఆ సినిమా స్థాయిని బట్టి ఆ సినిమా గురించి ఆలోచించే ప్రేక్షకులు అభిమానులు ఉంటారని అందువల్ల తమ అఖిల్ సినిమా ఏ పరిస్థుతులలోను ‘బ్రూస్ లీ’ కి పోటీ కాదు అనే స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు నితిన్. వినాయకచవితి రోజున విడుదల కాబోతున్న తన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ గురించి మాట్లాడుతూ రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కొత్త పాయింట్ తో తీసిన సినిమాలు హిట్ అవుతున్న నేపధ్యంలో తన ‘కొరియర్ బాయ్’ కూడ హిట్ అవుతుంది అన్న నమ్మకం తనకు ఉంది అని కామెంట్ చేసాడు నితిన్.  

ఈ సినిమాలో చెప్పిన పాయింట్ నిజంగానే జరిగింది అని అంటూ బాంబేలో ఇలాంటి ఇన్సిడెంట్ ఈమధ్య జరిగింది అని చెపుతూ తన సినిమా ఆలశ్యం అవడం ఈవిధంగా తనకు కలిసి వచ్చిందని అంటూ పవన్ సెంటిమెంట్ తో ఈసినిమా కూడ తనకు హిట్ ను ఇస్తుంది  ఆశిస్తున్నాడు నితిన్..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: