నిన్న రాత్రి కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ ప్రీమియర్ షోకు ముంబాయి మీడియాకు చెందిన అనేకమంది జర్నలిస్టులు మరియు క్రిటిక్స్ హాజరైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ సినిమా విమర్శకుడు తరణ్ ఆదర్ష్ బాలీవుడ్ క్రిటిక్ ఫడ్నవిస్ లాంటి ప్రముఖులతో పాటు ఎందరో ప్రముఖ జర్నలిస్టులు ‘బాహుబలి’ సినిమాను చూసారు.
ఈ సినిమాను చూసినవారు అంతా ‘బాహుబలి’ గొప్పతనాన్ని గురించి వ్రాయాలి అంటే కొత్త పదాలను అన్వేషించాలి అని కామెంట్స్ చేసినట్లు టాక్. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమైన స్క్రీన్ ప్లే ‘బాహుబలి’ ని ఎవ్వరూ అందుకోలేనంత ఉన్నత స్థాయిలో ఉంచినట్లు కామెంట్ చేస్తూ ఉండగా తరణ్ ఆదర్ష్ మరొక ముందడుగు వేసి రాజమౌళి ఊహాశక్తిని అందుకునే స్థాయి భారతదేశంలోని ఏ సినిమా రచయితకు లేదు అని అనడమే కాకుండా ‘బాహుబలి’ నిజంగా మాస్టర్ పీస్ అంటూ కితాబ్ ఇచ్చాడు.
అంతేకాదు ఈ సినిమా రాజమౌళి ప్రతిభకు నిదర్శనం అంటూ అద్భుతమైన సెట్స్, ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఫోటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ‘బాహుబలి’ ని ఇండియన్ సినిమా మాస్టర్ పీస్ గా మారుస్తాయని ఈ ప్రీమియర్ షోకి వచ్చిన వారంతా అభిప్రాయ పడ్డట్లుగా తెలుస్తోంది.
మరో బాలీవుడ్ క్రిటిక్ ముంబాయి నుండి ప్రచురితమయ్యే ‘మిడ్ డే’ సినిమా కాలమిస్ట్ ఫడ్నవిస్ ‘బాహుబలి’ చూసి చూసి తన ట్విటర్ లో కామెంట్ చేస్తూ ‘మజా ఆ గయాభాయ్’ అంటూ ‘బాహుబలి’ మరియు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే బాలీవుడ్ క్రిటిక్స్ నే ‘బాహుబలి’ మెప్పించింది కనుక టాలీవుడ్ లో ‘బాహుబలి’ ఒక చరిత్ర క్రియేట్ చేయబోతోంది అన్నది నిజం..