క్యాలెండర్ గర్ల్స్ టీజర్ అదుర్స్..!

Edari Rama Krishna
బాలీవుడ్ సంచలన దర్శకుడు మధుర్ బండార్కర్ ఒక డిఫరెంట్ స్టయిల్ ఫిలిమ్ మేకర్. ఈయన తీసే సినిమాలు దాదాపు సమాజంలో జరుగుతున్న అంశాలపై మనసుకు హత్తుకునే లా తీస్తాడు. కాకపోతే ఈయన తీసిని సినిమాలు కొంతమంది సెటైర్లు వేస్తారు. గతంలో మధుర్ బండార్కర్ తీసిన సినిమాలు ‘చాందిని బార్’, మోడలింగ్ గర్ల్స్ పై ‘ఫ్యాషన్’, కథానాయికల జీవితంపై ‘హీరోయిన్’ లాంటి చిత్రాలను తెరకెక్కించారు.  ఇప్పుడు  ‘క్యాలెండర్ గర్ల్స్’ పై సినిమా తీయబోతున్నాడు.

 క్యాలెండర్ గర్ల్స్ పోస్టర్


ఈ మద్య కాలంలో ఫ్యాషన్ గర్ల్స్ తో క్యాలెండర్స్ పై ఫోటో షూట్స్ బాగా తీస్తున్నారు మరి వారిజీవితాల్లో నిజమైన ఫ్యాషన్ దాగి ఉందా.. వారు పడుతున్న అవస్తలు,  అలాగే ఇటు ఈ ఫోటోషూట్ లో పాల్గొన్న భామలకు భారీ రెమ్యునరేషన్, పబ్లిసిటీ, సినిమాల్లో అవకాశాలు, క్రేజ్... ఇలా ఉపయోగాలు. ఈ సినిమాలో చూపించబోతున్నాడట. ఈ సినిమాలో ముఖ్యంగా ఐదుగురు క్యాలెండర్ గర్ల్స్ జీవితాలలో వచ్చే మార్పులను కథాంశంగా చూపిస్తున్నారు.

ఈ సినిమాలో సెక్సీ, హాట్ మోడల్స్ ను, ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించని కొత్త భామలను ఎంపిక చేసారు. ఇందులో ఈ భామలు తమ అందచందాలతో పిచ్చెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో విడుదల చేయనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: