ప్రపంచం అంతటా ఉర్రూతలూగించిన ప్రేమ
కథా చిత్రం ‘టైటానిక్’ . ఈ సినిమాలో ప్రేయసి కోసం ప్రేమికుడు చివరి వరకు పోరాడి
చనిపోతాడు. హృదయ విదారకమైన ప్రేమ కథా చిత్రం. అస్కార్ అవార్డుల పంట పండించిన చిత్రం.
మరి ఈ చిత్రంలో నటించి అందాల రాశి కేట్ విన్స్లెట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో కెట్ ని పూర్తి నగ్నంగా హీరో చిత్రం వేస్తాడు. అప్పట్లో ఈ సన్నివేశం కుర్రకారుకి దిమ్మతిరిగేలా చేశాయి.
టైటానిక్ చిత్రంలో ఓ సన్నివేశం
టైటానిక్
చిత్రంలో తన సెక్సీ ఆకృతితో యావత్ప్రపంచాన్ని తనవైపు ఆకర్షించిన కేట్ విన్స్లెట్
మరోమారు నగ్నంగా ఫోజిచ్చింది. టైటానిక్‌లో జాక్ బొమ్మ వేసేటపుడు నగ్నంగా కనబడి
హీటెక్కించిన ఈ భామ మరోసారి కెమేరా ముందు శరీరంపై నూలు పోగు లేకుండా నగ్నంగా
ఫోజులిచ్చింది. ఈ మధ్య రోమ్ లో ఓ పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో
అమ్మడు నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోజులిచ్చి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ విషయమై
కేట్ విన్స్లెట్ ని కదిలించగా తనకు ఇదేమీ కొత్త కాదని ఇలాంటి ఫోటో షూట్ చాలా
ఇచ్చానని అందం ఉంది చూపించడానికే కాని దాచుకోవడానికి కాదంటుంది. పైగా తన నగ్న ఫోటో
చాలా అందంగా వచ్చాయని ఉబ్బి తబ్బిబైపోతుంది.