ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా హరితేజ ను దారుణంగా...?
ఇక ఆమె కు అవకాశాలు ఎన్నున్నా ఆమెపై రూమర్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి.. బేసిక్ గా నటి అంటేనే ఆమెపై గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయి.. అవి అందులో నిజం లేదని చాలామందికి తెలిసినా నిప్పు లేనిదే పొగ రాదు అనే సామెత కూడా మనం మర్చిపోవద్దు.. ఇకపోతే హరితేజ విషయంలో తనపై వచ్చిన రూమర్స్ కి ఆమె క్లారిటీ ఇచ్చేదాకా అవన్నీ పుకార్లే అని ఎవరికీ తెలీదు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్.. అయినా కూడా ఆమెపై రూమర్లు, ట్రోల్ లు మాత్రం ఆగట్లేదు..
అయితే లాక్‌డౌన్ సమయంలో హరితేజ గర్భవతి అయ్యారు. త్వరలోనే తల్లిని కాబోతున్నాననే వార్తను తన అభిమానులు, శ్రేయోభిలాషులతో పంచుకొన్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా హరితేజ ధరించిన డ్రస్పై నెటిజన్లు ఘాటైన కామెంట్లు చేశారు.సోషల్ మీడియాలో తనపై కామెంట్ చేసిన వారి గురించి హరితేజ వెల్లడిస్తూ.. నాకు నచ్చిన బట్టలు వేసుకోవడం నా ఇష్టం. ప్రతీ రంగంలో ఉండే మహిళలకు తమకు నచ్చిన విధంగా ఉండే హక్కు ఉంది. వారి వారి సౌలభ్యం కోసం ఎలాంటి దుస్తులైనా ధరించడానికి అవకాశం ఉంది. దానిని మరొకరు కాదనడానికి హక్కు లేదు అంటూ హరితేజ ఘాటుగా స్పందించారు.ఎవరిపైనైనా నచ్చినట్టు కామెంట్లు చేసే హక్కు ఎవ్వడికి లేదు. అది మీ సంస్కారానికి సంబంధించిన విషయం. అబ్బాయిలను ఈ విషయంలో పక్కన పెడితే అమ్మాయిలు కూడా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అని అందుకే అన్నారేమో అంటూ హరితేజ తీవ్రంగా స్పందించారు.