ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా.. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..!?

Suma Kallamadi
చిత్ర పరిశ్రమ అంటే ఒక్క మాయ లోకం. ఎప్పుడు ఎవరి జీవితాన్ని మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలీదు. నేడు స్టార్ లా కనిపించిన వ్యక్తిని మరుసటి రోజు పరిశ్రమలో వెనక్కి నెట్టేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఇండస్ట్రీలోకి ఎందరో వస్తుంటారు వెళ్తుంటారు. కొందరు కొన్ని సినిమాలే చేసినా ఎక్కువ పేరు తెచ్చుకుంటారు. కొందరు ఎంత ప్రయత్నించినా ఛాన్స్ లు రాక పక్కకు తప్పుకుంటారు.

అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన ఈవీవీ సత్యనారాయణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చిత్రీకరించిన “ఫిట్టింగ్ మాస్టర్” అనే చిత్రం ద్వారా ముంబై బ్యూటీ “మదాలస శర్మ” హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే అల్లరి నరేష్ హీరో చిత్రంలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో గుర్తింపు లభించలేదు.

ఇక “మేం వయసుకు వచ్చాం” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించింది ఈ భామ. ఈ మూవీ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అయితే తర్వాత పెద్దగా ఛాన్స్ లు రాకపోయినా ఛాన్స్ కోసం ప్రయత్నించింది. నూతన దర్శకుడు శ్రీపురం కిరణ్ తెరకెక్కించిన రామ్ లీల, అనే మూవీలో ఓ చిన్న పాత్రలో మెరిసిన ఈమెకు అదే తెలుగులో ఆఖరి చిత్రం. నిజానికి ఈమె తమిళం, కన్నడ, తదితర భాషలలో కూడా హీరోయిన్ గా నటించింది.

అయితే కథల విషయంలో తగిన శ్రద్ధ పెట్టకపోవడంతో ఎక్కువ శాతం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. రానురాను సినిమా ఛాన్స్ లు తగ్గిపోవడంతో హిందీలో పలు చిత్రాలలో విలన్ గా నటించిన “మహాక్షయ్ చక్రవర్తి” అనే నటుడిని ప్రేమించి 2018లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి మదాలస శర్మ ముంబైలో ఉంటూ వ్యాపారాలపై దృష్టి పెట్టిందట.అలాగే హింది సిరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: