హీరో కంటే విలన్లనే పవర్ ఫుల్ గా చూపించిన సినిమాలు ఇవే..!?
మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమాలో కూడా విలన్ గా తండ్రి పాత్రలో నటించిన విజయ్ సేతుపతి పాత్ర చాలా ధీటుగా ఉంటుంది. మాస్టర్ సినిమాలో కూడా హీరో విజయ్ పాత్ర కంటే.. విలన్ గా నటించిన విజయ్ సేతుపతి పాత్రనే హై లైట్ చేశారు. స్పైడర్ సినిమాలో కూడా హీరోగా నటించిన మహేష్ బాబుని ఎస్ జె సూర్య ఏ రేంజ్ లో ఆడేసుకుంటాడో మనం చూసాం. విలన్ కె ఎక్కువ మాటలున్నట్లు చూపించారు.
మహేష్ హీరోగా నటించిన సినిమా అతిధి. ఇందులో కూడా హీరో పాత్ర కంటే విలన్ గా నటించిన మురళి శర్మ పాత్ర హై లైట్ గా నిలుస్తుంది. సూర్య హీరోగా వచ్చిన సెవెంత్ సెన్స్ సినిమా లో విలన్ గా యాక్ట్ చేసిన జానీ అనే పాత్ర హీరో రోల్ ని డామినేట్ చేస్తుంది. బాహుబలి సినిమాలో కూడా హీరో ప్రభాస్ కంటే విలన్ గా నటించిన రానాకి ఎక్కువ ఎలివేషన్స్ చూపించారు. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించారు. ఈ సినిమా లో కూడా గోపీచంద్ పాత్రను హై లైట్ చేసి చూపించారు.
గోపీచంద్ విలన్ గా నటించిన మరొక సినిమా నిజం. ఈ సినిమా లో మహేష్ బాబు హీరో గా నటించారు. ఈ సినిమా లో కూడా గోపీచంద్ హీరో ని చాలా రకాలుగా ఏడిపించినట్లు చూపిస్తారు. ఈ సినిమాలో మొదట హీరో, విలన్ లు ఒకేలా ఆలోచిస్తున్నట్లు చూపించిన ఒక స్టేజి వచ్చేసరికి విలన్ అడ్వాన్స్ గా ఉన్నట్లు చూపిస్తారు. కొన్ని చోట్ల విలన్ పాత్ర హీరో అల్లు అర్జున్ పాత్రని డామినేట్ చేసినట్లు ఉంటుంది.