పోకిరి లో పండుగాడి పాత్ర వెనకాల ఇంత సీక్రెట్ ఉందా..?
అంతకు ముందు వరుకు ప్రిన్స్ అని పిలిపించుకున్న మహేష్ పోకిరి హిట్ తో సూపర్ స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుత తెలుగు సినిమా అగ్రకధనాయకులలో ఒకడిగా వెలుగొందుతున్న మహేష్ నటనలో తన ఖలేజాను చూపిస్తూ దూకుడు గా తారా పదానికి దూసుకుపోతున్నాడు.హీరో యాక్టింగ్ లో పూరి సినిమాకి ముందు పూరి సినిమా తర్వాత అనేంత చేంజ్ ఓవర్ తీసుకురాగలిగిన దర్శకుడు పూరి.కాగా అప్పట్లో ఆంధ్రావాలా ,సూపర్ లాంటి ప్లాప్ చిత్రాలను తీసిన పూరితో సినిమా అనగానే మహేష్ బాబు ను చాలామంది హెచ్చరించారంట . కాని వీటిని పట్టించుకోకుండా పూరితో పోకిరి చిత్రం చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు మహేష్ .
అప్పటిదాకా మహేష్ అంటే కృష్ణ తనయుడిగా గుర్తించేవారు .కానీ ఈ చిత్రంతో మహేష్ స్టార్ హీరో అయ్యాడు. మహేష్ కెరీర్లోనే పోకిరి ఒక మైలురాయి . దీంతో బాలీవుడ్ లో కూడా మహేష్ గురించి పెద్దగానే చర్చలు జరిగాయి . సల్మాన్ ఖాన్ వంటి బడా హీరో కూడా మహేష్ గురించి తెలుసుకొనే స్థాయికి చేరారు .కాగా అప్పట్లో జాన్ ఏ మన్, బాబుల్, సలాం ,ఇష్క్, యువరాజ్, మారిగోల్డ్ లాంటి వరుస ప్లాప్ చిత్రాలలో నటించాడు సల్మాన్.దీంతో సల్మాన్ టైం బాగోలేదు సల్మాన్ కెరీర్ అయిపోయింది అని అనుకున్నారంతా .ఆ సమయంలో పోకిరి చిత్రాన్ని వాంటెడ్ అనే పేరుతొ రీమేక్ చేసి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు దీంతో మళ్ళి సల్మాన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు . కాగా వాంటెడ్ కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు .
ఈ సినిమాకి సంబంధించి ఒక మెగా సీక్రెట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘స్టేట్ రౌడీ’ ని రీమేక్ చేస్తే ‘పోకిరి’ అయ్యిందట. టి.సుబ్బిరామి రెడ్డి నిర్మించిన ‘స్టేట్ రౌడీ’ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడు. సిటీలో పెద్ద దాదాగా చెలామణి అవుతూ ఉన్న కాళీ చరణ్ ను ఓ ఇద్దరు డాన్ లు తమ వైపుకి తిప్పుకోవాలి అనుకుంటారు .చివరికి అతను ఓ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ పృథ్వి అని తెలుస్తుంది. ఇక పూరి మహేష్ తో చేసిన ‘పోకిరి’ కథ తెలిసిందే. సిటీలో ఉన్న మాఫియా ని ఏరి పారేయడానికి పండు అనే కిరాయి గూండా అవతారం ఎత్తుతాడు కృష్ణ మనోహర్ అనే పోలీస్ ఆఫీసర్. చాలా వరకూ సేమ్ లైన్ అయినప్పటికీ పూరి ఎంతో ఎంగేజింగ్ నేరేషన్ తో ‘పోకిరి’ ని తెరకెక్కించాడు . సో పోకిరి లో పండు గాడి పాత్ర వెనకాల ఎంత సీక్రెట్ ఉందొ అంతే సీక్రెట్ పోకిరి కధ వెనకాల కూడా ఉందన్న మాట