రామ్ తో అదిరిపోయే మూవీ అంటున్న యంగ్ డైరెక్టర్ ?
రామ్ తో సినిమాలు తీయడానికి డైరెక్టర్లు ఎపుడూ రెడీగా ఉంటారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా రామ్ మాత్రం తన నటన విషయంలో ఎపుడూ ఎక్కడా రాజీ పడలేదు. తాజాగా రామ్ రెడ్ మూవీ చేశాడు. ఆ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయి ఆడియన్స్ ని అలరించింది.
ఇక రామ్ తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి డైరెక్షన్ లో కొత్త మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇదిలా ఉంటే యంగ్ హీరో శ్రీ విష్ణు తాను రామ్ ఫావరేట్ అని తాజాగా జరిగిన గాలి సంపత్ ఆడియో ఫంక్షన్ లో చెప్పుకున్నాడు. తాను హీరో అవడానికంటే ముందు ఇండస్ట్రీలో డైరెక్షన్ చేద్దామని వచ్చానని, తాను రాసిన కధలకు హీరోగా రామ్ నే ఊహించుకునేవాడినని కూడా చెప్పాడు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అయితే రామ్ ని బాగా ఎత్తేశారు. రాం ఎనర్జీ లెవెల్స్ ఒక లెక్కన ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు. తాను రామ్ తో సినిమా చేయలని అనుకుంటున్నాని, కానీ కుదరడం లేదని కూడా చెప్పాడు. మంచి కధతో రామ్ తో అదిరిపోయే సినిమా తీయడానికి తాను రెడీ అంటూ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మొత్తానికి రామ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూసే ఇది. అనిల్ రావిపూడి అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్. మరి రామ్ కామెడీ కూడా బాగా చేస్తాడు. మొత్తానికి ఈ ఇద్దరి కాంబో కోసం అటు ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.